ప్రస్తుతానికి UK మరియు US లో
అమెజాన్ ఇంతకముందు Twitch అనే పేరుతో లైవ్ వీడియో స్ట్రీమింగ్ కొరకు ఒక సర్వీస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దానికి పోటీ గా గూగల్ అదే తరహా కాన్సెప్ట్ ను రిలీజ్ చేసింది నిన్న.
వేరే వ్యక్తుల యొక్క గేమింగ్ ను లైవ్ గా చూపించటం, లేదా సొంత స్ట్రీమింగ్ ను ప్రదర్శించటం దీని ఉపయోగం. అంటే ఇది ఇండియన్ మార్కెట్ కు రావటానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది.
అంటే ఇది కంప్లీట్ గేమింగ్ అంటే ఇష్ట పడే వారికీ. జూన్ నెలలో గూగల్ దీనిని అనౌన్స్ చేసింది. ఆటోమేటిక్ గా గేమింగ్ కు సంబందించిన వీడియోస్ అన్నీ ఒక దగ్గర కేటగరీ చేసి, గేమింగ్ వీడియోలను రికమెండ్ చేస్తుంది యూట్యూబ్.
వీడియో ను dvr మోడ్ లో బఫర్ చేసి చూస్తున్న లైవ్ వీడియోను rewind చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇది అమెజాన్ Twitch.tv లో లేదు. ఎండ్ పాయింట్ ఏంటంటే.. ఇది కేవలం గేమింగ్ కు సంబందించిన యూట్యూబ్ వీడియో ప్లాట్ఫారం. ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు ఈ లింక్ లో గూగల్ యుట్యూబ్ గేమింగ్ ను చూడగలరు.