గూగల్ లేటెస్ట్ గా మంచి engaging సరదా సింపుల్ గేమ్ ను ప్రవేశపెట్టింది. ఇది జస్ట్ మీ ఫోన్ లేదా డెస్క్ టాప్ బ్రౌజర్ లో ఆడగలరు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పనిచేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫ్యూచర్ ను మర్చబోయే అప్ కమింగ్ రివల్యుషనరీ టెక్నాలజీ. దీని పై మరింత సింపుల్ అనాలిసిస్ కొరకు ..ఈ లింక్ లో వ్రాసిన స్టోరీ చదవగలరు.
ఇక గూగల్ వేరి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ గేమ్ విషయానికి వస్తే.. ఇది సింపుల్ గా చేతితో లేదా మౌస్ తో స్క్రీన్ పై గూగల్ అడిగే బొమ్మలను బేసిక్ డ్రాయింగ్ తో వేయటం.
ఒక బొమ్మను అడిగిన తరువాత 20 సేకేండ్స్ టైం ఇస్తుంది. ఈ లోపు అడిగిన బోమను గీతలతో వేస్తె రెండవ బొమ్మ అడుగుతుంది. ఇలా 5 బొమ్మలను గీయాలి.
వినటానికి.."ఏముంది ఇందులో" అనిపిస్తుంది కానీ ఒకసారి ఆడటం మొదలుపెట్టిన తరువాత ఒక్కో బొమ్మను ఫినిష్ చేసే కొద్దీ ఇంటరెస్ట్ గా అనిపిస్తుంది.
గూగల్దీ యొక్క neural network algorithm పై పనిచేసే ఈ గేమ్ పేరు Google Quick Draw. మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు అడిగిన బొమ్మ వచ్చే వరకూ ఒప్పుకోదు…
గేమ్ యొక్క పిక్స్ క్రింద చూడగలరు. గేమ్ ను ఆడేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. అయితే ఇది లింక్ ద్వారానే ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాప్ రూపంలో లేదు.