కంప్లీట్ గా గూగల్ చే తయారు అయిన Pixel C అనే టాబ్లెట్ ను ఇంతకముందే గూగల్ రివీల్ చేయటం జరిగింది లేటెస్ట్ నెక్సాస్ ఫోన్స్ తో పాటు.
ఇప్పుడు పిక్సెల్ C గూగల్ ప్లే స్టోర్ లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. అవును ప్లే స్టోర్ లో గాడ్జెట్స్ కూడా అమ్ముతుంది గూగల్. 32gb వెర్షన్ ప్రైస్ 34,000 రూ, 64GB 40,000 రూ.
ఇది ఇంకా ఇండియన్ ప్లే స్టోర్ లో లేదు. త్వరలోనే వస్తుంది అని అంచనా. దీనికి మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ ప్రో 4, ఆపిల్ ipad ప్రో అండ్ xiaomi Mi ప్యాడ్ 2 పోటీ గా ఉంటాయి.
స్పెక్స్ – 3gb DDR3 ర్యామ్, 32gb, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 9000 mah బ్యాటరీ, 10.2in LTPS 2560 x 1800 LCD డిస్ప్లే, 8MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కెమేరా
ఆప్షనల్ కీ బోర్డ్ (9,000 రూ), ఆండ్రాయిడ్ 6.0. ప్రతీ 6 వారాలకు os అప్ డేట్స్ వస్తాయి. ప్రీమియం గ్లాస్ అండ్ అల్యూమినియం బిల్డ్.