గూగల్ మరియు ట్విట్టర్ కుదుర్చుకున్న ఒప్పందం తో ఇకపై గూగల్ సెర్చ్ లో స్మార్ట్ ఫోన్లలో ట్విట్లు మరింత గ్రాఫికల్ కనపడనున్నాయి. ఇదే ఫీచర్ త్వరలో డెస్క్టాప్ వెర్షన్ కూడా రానుంది.
మీరు సాధారణంగా మొబైల్ లో సెర్చ్ చేస్తే ఇంతక ముందు ట్విట్లు వచ్చేవి కాదు. ఇందుకోసం గూగల్ కు కొంత పేమెంట్ ఇస్తుంది ట్విట్టర్, అయితే బదులుగా తిరిగి ట్రాఫిక్ ను పొందుతుంది ట్విట్టర్. ఎప్పటికప్పుడు ట్విట్టర్ కొత్త యుజర్లకోసం మరియు ఉన్న యుజర్లను ఎంగేజింగ్ గా ఉంచేందుకు తరచుగా ఎదో ఒక ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఇదే బాటలో తాజాగా ట్విట్టర్ తన హోం పేజ్ తో పాటు "మీరు లేనప్పుడు ఏమీ జరిగాయి" మరియు "హైలైట్స్" అనే ఫీచర్స్ తో పొందుపరిచింది.
ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… "గూగల్ తో కలిసి ట్విట్టర్ ను గూగల్ సెర్చ్ లో అనుసంధానం చేయటం సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి మొబైల్ వెర్షన్ సెర్చ్ లో లభించే ఈ ఫీచర్ కొన్ని దేశాలలో లభ్యమవుతుంది. కొన్ని నెలలో మరిన్ని దేశాలకి వ్యాపిస్తాం." అని పేర్కొన్నారు. మీకు నచ్చిన హీరో గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఆ వ్యక్తి గురించి మీరు సెర్చ్ చేసినప్పుడు, అతను తన సోషల్ బ్లాగుల్లో తాజాగా చెప్పిన మాటలను, ట్విట్లను ఇప్పుడు చూడగలుగుతారు.
ఆధారం: గూగల్