గూగుల్ క్రోమ్ క్యాస్ట్ నుంచి నేటి కాలానికి తగిన ఫీచర్స్ తో కొత్త Google TV Streamer (4K) ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్ట్రీమింగ్ పరికరం 4K రిజల్యూషన్ తో స్ట్రీమింగ్ అందించడమే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తి సామర్థ్యాలతో నిండి వుంది. గూగుల్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్రోడక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) ప్రోడక్ట్ ను గూగుల్ చాలా గొప్ప ఫీచర్స్ తో అందించింది. ప్రస్తుత నవీన స్మార్ట్ టీవీ లకు తగిన అన్ని వివరాలతో ఈ కొత్త గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) ని అందించింది. ఇది కొత్త ప్రోడక్ట్ ని 4K HDR రిజల్యూషన్ 60 FPS సపోర్ట్ తో అందించింది. ఇది Dolby Vision, HDR10, HDR10+ మరియు HLG సపోర్ట్ లతో వస్తుంది మరియు లీనమయ్యే విజువల్స్ కు గ్యారెంటీ ఇస్తుంది.
గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు ఇందులో బ్లూటూత్ 5.1 సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీ స్ట్రీమర్ (4K) ని 4GB మెమరీ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో గూగుల్ లాంచ్ చేసింది. ఇందులో టైప్ C పోర్ట్, HDMI 2.1 (Type A) పోర్ట్ మరియు Ethernet (10/100/1000 Mbps) పోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Jio Best Plan: జియో కస్టమర్లకు మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
ఇది Android TV OS పైన నడుస్తుంది మరియు వాయిస్ రిమోట్ తో కూడా వస్తుంది. ఈ గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) Dolby Digital, Dolby Digital Plus, మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) US మార్కెట్లో విడుదలయ్యింది. ఈ ప్రోడక్ట్ ఇండియా లాంచ్ గురించి గూగుల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గూగుల్ ఈ టీవీ స్ట్రీమర్ ను $99.99 (సుమారు రూ. 8,395) ధరలో విడుదల చేసింది.