భారీ ఫీచర్స్ తో Google TV Streamer (4K) ను ప్రవేశపెట్టిన గూగుల్.!
గూగుల్ కొత్త Google TV Streamer (4K) ను ప్రవేశపెట్టింది
ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తి సామర్థ్యాలతో నిండి వుంది
గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) ప్రోడక్ట్ ను గూగుల్ చాలా గొప్ప ఫీచర్స్ తో అందించింది
గూగుల్ క్రోమ్ క్యాస్ట్ నుంచి నేటి కాలానికి తగిన ఫీచర్స్ తో కొత్త Google TV Streamer (4K) ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్ట్రీమింగ్ పరికరం 4K రిజల్యూషన్ తో స్ట్రీమింగ్ అందించడమే కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తి సామర్థ్యాలతో నిండి వుంది. గూగుల్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ ప్రోడక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Google TV Streamer (4K) : ఫీచర్లు
గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) ప్రోడక్ట్ ను గూగుల్ చాలా గొప్ప ఫీచర్స్ తో అందించింది. ప్రస్తుత నవీన స్మార్ట్ టీవీ లకు తగిన అన్ని వివరాలతో ఈ కొత్త గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) ని అందించింది. ఇది కొత్త ప్రోడక్ట్ ని 4K HDR రిజల్యూషన్ 60 FPS సపోర్ట్ తో అందించింది. ఇది Dolby Vision, HDR10, HDR10+ మరియు HLG సపోర్ట్ లతో వస్తుంది మరియు లీనమయ్యే విజువల్స్ కు గ్యారెంటీ ఇస్తుంది.
గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు ఇందులో బ్లూటూత్ 5.1 సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీ స్ట్రీమర్ (4K) ని 4GB మెమరీ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో గూగుల్ లాంచ్ చేసింది. ఇందులో టైప్ C పోర్ట్, HDMI 2.1 (Type A) పోర్ట్ మరియు Ethernet (10/100/1000 Mbps) పోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Jio Best Plan: జియో కస్టమర్లకు మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
ఇది Android TV OS పైన నడుస్తుంది మరియు వాయిస్ రిమోట్ తో కూడా వస్తుంది. ఈ గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) Dolby Digital, Dolby Digital Plus, మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ గూగుల్ టీవీ స్ట్రీమర్ (4K) US మార్కెట్లో విడుదలయ్యింది. ఈ ప్రోడక్ట్ ఇండియా లాంచ్ గురించి గూగుల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Google TV Streamer (4K) : ధర
గూగుల్ ఈ టీవీ స్ట్రీమర్ ను $99.99 (సుమారు రూ. 8,395) ధరలో విడుదల చేసింది.