Google Tone సరికొత్త ఎక్స్టెన్షన్ – సౌండ్ తో URL షేరింగ్.
టోన్, తాజాగా విడుదలైన క్రోమ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఇది మీ డివైజ్ ఆడియో ఆధారంగా URL's ను షేర్ చేస్తుంది.
Google Tone అనేది తాజాగా విడుదలైన ఒక ప్రయోగాత్మకమైన క్రోమ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఇది మీ లాప్టాప్ ధ్వని ని ఉపయోగించి మీ క్రోమ్ ప్రస్తుత టాబ్ యొక్క URL షేరింగ్ ను అనుమతిస్తుంది. గూగల్ టోన్ ను ఉపయోగించటం చాలా సులువు. మీరు టోన్ ని ఇంస్టాల్ చేసుకున్నాక, క్రోమ్ బ్రౌజర్ ను వాడుతున్నప్పుడు, మీ లాప్టాప్ సౌండ్ ఎక్కువుగా పెట్టుకొని, క్రోమ్ బ్రౌజర్ లో టోన్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెంటనే మీ డివైజ్ నుండి షార్ట్ బీప్వ సౌండ్స్ వస్తాయి.
ఇవి టోన్ ఎక్స్టెన్షన్ ఇంస్టాల్ చేయబడిన వేరే లాప్టాప్ మైక్ కు చేరి ఆ లాప్టాప్ కు URL ను షేర్ చేస్తుంది. రిసివర్స్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసినవెంటనే అది పంపబడిన URL పేజ్ ను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. ఇది ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డ్రాప్ కాన్సెప్ట్ కు దగ్గరలో ఉంటుంది. అయితే ఇది పూర్తిగా లాప్టాప్ మైక్ ప్రక్సిమిటి క్వాలిటీ కి సంబంధించినది. మీరు పంపే ప్రతీ సౌండ్ లింక్ పని చేయక పోవచ్చు కాని రిసేండ్ చేయడం అనేది సింగిల్ క్లిక్ లో జరిగే విషయం.
సరదాగా గూగల్ కంపెని లో డెవెలప్ చేసిన దీన్ని తరువాత ఉపయోగకరంగా ఉందని బయటకు విడుదల చేసారని గూగల్ చెబుతుంది. గూగల్ టోన్ ఎక్స్టెన్షన్ ను ఈ లింక్ లో పొందగలరు. ఇది ప్రధానంగా ఆన్ లైన్ క్లాస్ రూమ్స్ మరియు సేమినర్స్ లలో బాగా వాడబడుతుంది. క్రోమ్ బ్రౌజర్ కు సంబందించిన 20 ఉపయోగకరమైన ఎక్స్టెన్షన్లు మరిన్ని ఇక్కడ చుడండి.