గూగుల్ ప్లే స్టోర్ అప్డేట్స్ ఆప్ పాలసీ ,”పునరావృత కంటెంట్ మరియు క్రిప్టోమైనింగ్ ఆప్” లను నిషేదించింది
ప్లే స్టోర్లో ఉన్న ఆప్స్ మరియు కంటెంట్ కోసం అనేక మార్పులను గూగుల్ ఇప్పుడు ప్రకటించింది. పునరావృత కంటెంట్ మరియు క్రిప్టోమైనింగ్ ఆప్ లను నిషేధించడమే కాకుండా, అడల్ట్ థీమ్లతో ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ఆప్ లు కూడా బూట్ చేయబడ్డాయి.
డెవలపర్లు ప్లే స్టోర్లో కొన్నిరకాల మార్పులకు అందుబాటులో ఉండనున్నారని గూగుల్ అనేక మార్పులను ప్రకటించింది, ఇది ఆప్ లను ఇన్స్టాల్ చేయడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆప్స్ గమ్యస్థానంగా ఉంది. గూగుల్ ప్లే స్టోర్ కోసం పాలసీ ఫ్రేమ్ వర్క్ కోసం అనేక అప్డేట్ లను గూగుల్ చేస్తోంది మరియు ఈ అన్ని అప్డేట్లూ కూడా కంటెంట్ పరిమితులకు సంబంధించినవి.
ముందస్తుగా ,గూగుల్ ఇప్పటికే ఉన్న ఆప్ కు చాలా దగ్గరగా ఉండే ఇతర ఆప్ లను ఛేదించడానికి చూస్తోంది. "దాదాపుగా ఒకే విధమైన కంటెంట్ మరియు యూజర్ అనుభవం అందిస్తున్న బహుళ ఆప్ " లు లేదా ఆటోమేటెడ్ టూల్, విజర్డ్ సర్వీస్, లేదా టెంప్లేట్ల ఆధారంగా తయారుచేసి మరియు ఇతర వ్యక్తుల తరపున ఆ సేవ యొక్క ఆపరేటర్ గా గూగుల్ ప్లే కు సమర్పించిన ఆప్" ,లు ఇంక ప్లే స్టోర్ లో ఎక్కువ కాలం మనుగడలో ఉండబోవని తెలిపింది .
కాపీ రైట్స్ మరియు భద్రతా సమస్యల దృశ్యా ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో ఎక్కువగా నిండివున్న అనువర్తన ఆప్ లను తొలిగించాలని చూస్తుంది. చాలా రకాలైన వాట్సప్ వెర్షన్స్ కనుగొనబడ్డాయి , అంతేకాక భారతదేశ యోగా గురువు అయినటువంటి , బాబా రాందేవ్ గారు తన అత్యంత దోష పూరిత కింభో ఆప్ ని విడుదల చేసినప్పుడు ,అది కొన్ని వందల సార్లు వినియోగదారుల డేటా లో నకళ్లుగా మారింది .
ఇంకా,అక్రమ సంపాదనకు గని గా ఉన్న క్రిప్టో కరెన్సీ AKA క్రిప్టో మైనింగ్ ఆప్ లతో పాటుగా , "పేలుడు పదార్థాల అమ్మకం, తుపాకీలు, మందుగుండు సామగ్రి లేదా కొన్ని తుపాకీ ఉపకరణాలు వంటి వాటిని " ప్లే స్టోర్ నుండి నిషేధించారు.అడల్ట్ ఇతివృత్తాలతో పిల్లలకు ఉద్దేశించిన ఆప్ లను కూడా ప్లే స్టోర్ అనుమతించదు, అంతేకాక వినియోగదారులకు ప్రకటనలను మాత్రమే చూపే ఆప్స్ మరియు తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లేదా ఏ పద్ధతిలో అయినా వినియోగదారుని మోసం చేసే ఆప్ లనుకూడా గూగుల్ ప్లే స్టోర్ లో నిలువనివ్వడం లేదు.