Google Play Store నుంచి 22 లక్షల Malware Apps ని బ్యాన్ చేసిన గూగుల్.!
Google Play Store నుంచి 22 లక్షల Malware Apps ని అడ్డుకుంది
గూగుల్ తన ప్లే స్టోర్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది
ప్లే స్టోర్ నుండి 3 లక్షల 30 వేలకు పైగా అకౌంట్స్ కూడా బ్యాన్
ఆండ్రాయిడ్ ఫోన్ కు ప్రాణపదమైన Google Play Store నుంచి 22 లక్షల Malware Apps ని అడ్డుకుంది. యూజర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ కి పెద్ద పేట వేసే గూగుల్ తన ప్లే స్టోర్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా యూజర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ లకు భంగం కలగా కుండా కొన్ని గైడ్ లైన్స్ ను ఫాలో అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఏదైనా యాప్ ఈ గైడ్ లైన్స్ ను అతిక్రమించి నట్లయితే ఆ యాప్ ను వెంటనే బ్యాన్ చేస్తుంది.
Google Play Store
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, 2023 సంవత్సరం మొత్తం మీద గూగుల్ ప్లేస్టోర్ నియమాలకు విరుద్ధంగా స్టోర్ లో పోస్ట్ చేయబడిన 22.8 మిలియన్ (22,80,000) పైగా యాప్స్ ని అడ్డుకున్నట్లు గూగుల్ తెలిపింది. యూజర్ సెక్యూరిటీ కి భంగం కలిగించే విధంగా ఈ యాప్స్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా కూడా చెబుతోంది.
Malware Apps
కేవలం యాప్స్ మాత్రమే కాదు, 2023 సంవత్సరం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ప్లే స్టోర్ నుండి 3 లక్షల 30 వేలకు పైగా అకౌంట్ లను కూడా బ్యాన్ చేసినట్లు గూగుల్ తెలిపింది. స్కామర్లు మరియు ఫ్రాడ్స్టర్స్ సర్కిల్ ద్వారా మాల్వేర్ మరియు రిపీటెడ్ సర్వర్ పాలసీ ని బ్రేక్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్టు కూడా తెలిపింది.
గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ద్వారా యూజర్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ మరింత పటిష్టంగా మార్చడానికి మరిన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా గూగుల్ చెబుతోంది. గూగుల్ సెక్యూరిటీ బ్లాగ్ పోస్ట్ లో ఈ విషయాలు వెల్లడించినట్లు.
Also Read : Amazon Summer Sale: అమెజాన్ సేల్ భారీ ఆఫర్లతో రేపటి నుంచి స్టార్ట్ అవుతోంది.!
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ మోసాలకు కాకుండా మరిన్ని చర్యలు తీసుకుంటోంది మరియు చాలా సూక్ష్మ పరిశీలన కూడా గూగుల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన కొన్ని కొత్త నివేదికల ద్వారా Android 15 Beta లో ప్లే స్టోర్ యాప్స్ ఐసోలేట్ చేయడానికి మరియు రిస్ట్రిక్షన్స్ ను ఇవ్వడానికి కూడా వీలు ఉన్నట్లు తెలుస్తోంది.