digit zero1 awards

లక్షల కొద్దీ Gmail అకౌంట్స్ ను Delete చెయ్యబోతున్న గూగుల్ | Tech News

లక్షల కొద్దీ Gmail అకౌంట్స్ ను Delete చెయ్యబోతున్న గూగుల్ | Tech News
HIGHLIGHTS

ఇప్పటి వరకూ కనీ విని ఎరుగని అతిపెద్ద అప్డేట్ ను గూగుల్ అందించింది

లక్షల కొద్దీ Gmail mail అకౌంట్స్ ను Delete చేయనున్నది

కొత్తగా తీసుకు వచ్చిన నియమాల అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది

ఇప్పటి వరకూ కనీ విని ఎరుగని అతిపెద్ద అప్డేట్ ను గూగుల్ అందించింది. లక్షల కొద్దీ Gmail mail అకౌంట్స్ ను Delete చెయ్యడానికి గూగుల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యూజర్ల సెక్యూరిటీని మరింత పెంచడానికి తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈ కొత్త స్టెప్ తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ కొత్త అప్డేట్ గురించి వినగానే ఎవరి లేదా ఎటువంటి జీమెయిల్ లను డిలీట్ చేయబోతుందో? అని మీకు కూడా డౌట్ వచ్చి ఉండవచ్చు. గూగుల్ అందించిన ఈ కొత్త హాట్ న్యూస్ ఏమిటో తెలుసుకుందామా.

ఎవరి Gmail mail అకౌంట్ Delete చేస్తుంది గూగుల్?

రెండు సంవత్సరాలుగా యాక్టివ్ (Sign in) గా లేని యూజర్ల జిమెయిల్ అకౌంట్స్ ను డిలేట్ చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇన్ యాక్టివా అకౌంట్స్ పాలసీ లో కొత్తగా తీసుకు వచ్చిన నియమాల అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. 2023 సంవత్సరం మధ్యలో (మే నెలలో) గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ముందుగానే వివరించింది.

Also Read : Jio యూజర్లకు అధిక లాభాలను అందించే టాప్ 3 ప్లాన్స్.!

ఎప్పటి నుండి ఈ చర్యను అమలు చేస్తుంది?

2023 డిసెంబర్ 1 వ తేదీ నుండి ఈ చర్యను ఆచరిస్తుందని గూగుల్ తెలిపింది. అంటే, 2023 డిసెంబర్ 1 వ తేదీ నుండి గడిచిన రెండు సంవత్సరాలుగా సైన్ ఇన్ కానీ జీమెయిల్ అకౌంట్స్ అన్నింటిని తొలగిస్తుంది గూగుల్.

కేవలం జీమెయిల్ అకౌంట్ మాత్రమే డిలీట్ చేస్తుందా?

కేవలం జీమెయిల్ అకౌంట్ మాత్రమే డిలీట్ చేస్తుందా? అనేది మీ డౌట్ అయితే, గూగుల్ సమాధానం మాత్రం కాదు అనే చెబుతుంది. ఎందుకంటే, జిమెయిల్ అకౌంట్ తో పాటుగా దానితో అనుసంధానంగా ఉండే గూగుల్ ఫోటోస్, గూగుల్ Docs, డ్రైవ్, Meet, క్యాలెండర్ మరియు YouTube లలో ఉండే మొత్తం కంటెంట్ కూడా డిలీట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo