మనుషులుగా మన బాడీ కదలికలు లేదా పోజ్ గుర్తించడం సులభమే. అయితే యంత్రాలకు అదిసాధ్యంకాదు.కానీ ఇక్కడ యంత్రాలు నేర్చుకుంటునందుకు మెచ్చుకోవాలి , గూగుల్ ఇలాంటి మీ ప్రతీకదలిక గుర్తించేవిధంగా మరియు ఒకేవిధమైన ప్రతి పోజ్ ను సరిపోల్చే విధంగా కంప్యూటర్స్ మిర్రర్ ను నిర్వహిస్తుంది. వస్తువు స్థిరం గా ఉంటే దానిని సునాయాసంగా యంత్రం గుర్తించగలదు . కానీ కదులుతున్న భాగాలను గుర్తించడం అంత సులభం కాదు . గూగుల్ యొక్క టెన్సర్ ఫ్లో టీం AI అనే ప్రయోగం ద్వారా ఒక కొత్త పద్దతి తెచ్చింది అదే "మూవ్ మిర్రర్" ఇది గూగుల్ యొక్క పోస్ నెట్ న్యూరల్ నెట్వర్క్ ఉపయోగించుకొని మనం ఇచ్చిన పోజ్ ను అది అనుకరిస్తుంది.
పోజ్ నెట్ అనేది యంత్ర అభ్యాస పద్దతిని ఉపయోగించుకొని మనిషి శరీరం యొక్క వేరువేరు భాగాలను,కీళ్లను ఫోటో లేదా వీడియో లలో విశ్లేషించి చూపిస్తుంది . అయితే ఈ పద్దతి ముందుగా ఉంచబడిన 80,000 ఫొటోస్ నుండి పోజ్ ను సరిపోలుస్తుంది . గూగుల్ క్రియేటివ్ ల్యాబ్ లో ఒక క్రియేటివ్ టెక్నాలజిస్ట్ అయినటువంటి ఐరెన్ అల్వడో గారు దీని గురించి ఒక బ్లాగ్ పోస్ట్ లో ఇలా రాసారు , యంత్ర అభ్యాస పద్దతి అనేది ఒక డివైజ్ మీద కంప్యూట్ చేయడం,లేదా మీ బ్రౌజర్ మీద అనుసంధానం అవడం మాత్రమే . ఇంకా ఇది ఏవిధమైన ఇమేజెస్ స్టోర్ చేయడం లేదా సర్వర్ కు పంపడం లాంటివి జరగవని గూగుల్ వివరించింది .
మీ వెబ్ కెమేరా లేదా ఫోన్ యొక్క ముందు కెమేరా ఎదురుగా ఉంటే మూవ్ మిర్రర్ వాటిని విశ్లేషించి అదే సమయంలో అదే పోజ్ ఇచ్చిన అందరి ఇమేజెస్ ని సరిపోల్చడానికి ప్రయత్నిస్తుంది. అంటే దాదాపుగా అద్దం లాగా ఇంకా ఇది ఏఈ ప్రపంచం లోని స్పోర్ట్స్ ,మార్షల్ ఆర్ట్స్ ,యాక్టింగ్ ఇంకా ఎన్నో ఇమేజెస్ తోటి సరిపోలుస్తుంది . ఇది వచ్చిన ఫలితాన్ని GIF గా భద్రపరుస్తుంది దానిని మీకు స్నేహితులు లేదా నచ్చిన వారికీ పంపించవచ్చు .
మూవ్ మిర్రర్ అనేది పోజ్ ఎస్టిమేషన్ అని పిలువబడే ఒక కంప్యూటర్ విజన్ టెక్నీక్ కి ఒక ఉదాహరణ . ఎన్నో రకాలుగా ఉవుపయోగపడే విధంగా డెవలపర్ లు ప్రయోగాలు చేయడానికి పోజ్ నెట్ టెక్నాలజీ ని అందుబాటులో ఉంచింది . కాలానుగుణంగా కృత్రిమ మేధస్సు ఎంతగా ఎదుగుతుందో గూగుల్ కంపెనీ విడుదల చేసిన AI ప్రయోగం ద్వారా వివరించింది.