ఇంటర్నెట్ దిగ్గజం, గూగల్ తీసుకున్న కొత్త పేటంట్ ద్వారా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. మనుషుల రియల్ లైఫ్ ను కూడా సర్చ్ చేసుకునే సదుపాయాలు రానున్నాయనిపిస్తుంది.
పేటంట్ ప్రకారం గూగల్ రియల్ లైఫ్ ఈవెంట్స్ ను గూగల్ గ్లాస్ ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తుంది. అవి pair చేయబడ్డ ఫోనుకు మరియు సర్వర్స్ కు స్టోరేజ్ కోసం పంపించబడతాయి. వీటి ద్వారా మన జీవితంలో past ఏం జరిగిందో వీడియోస్ లో చూసుకోవచ్చు. ఇది రియల్ లైఫ్ searching సర్వీస్.
ఇది known లేదా historical లేదా మనం ముందు సెట్ చేసుకున్న లొకేషన్స్ లో కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తుంది అని పేటంట్ చెబుతుంది. తద్వారా పర్సేనల్ డేటా లేదా విషయాలు రికార్డ్ అయ్యి వీటిలో కలవకుండా ఉంచుతుంది. అయితే ఇది అటు మనం ఊహించని past searching అవకాశం ఇస్తూనే ఇటు privacy విషయాన్ని కూడా గ్లోబల్ చేస్తుంది.
Ofcourse ఎవరి అకౌంట్ వీడియోలు వారికే కనిపిస్తాయి కాని. యూజర్ id మరియు పాస్వర్డ్స్ వంటివి రోజుకో పాపులర్ వెబ్ సైటు hack అవుతున్న ప్రస్తుత ఆన్ లైన్ సైబర్ క్రైం లో యూజర్ id లలో ఫైల్స్ మెయిల్స్ ను స్టోర్ చేసుకోగలము కాని మన డైలీ రియల్ లైఫ్ వీడియోలను కూడా అప్ లోడ్ చేయటమనేది కొంచెం ఆలోచింపజేసే విషయం.