భారత-నిర్దిష్ట లక్షణాలను పొందడానికి గూగుల్ మ్యాప్స్

భారత-నిర్దిష్ట లక్షణాలను పొందడానికి గూగుల్ మ్యాప్స్
HIGHLIGHTS

గూగుల్ మ్యాప్స్ లో ఇప్పుడు ద్విచక్ర - వాహన మోడ్ ను పొందుతారు మరియు ఆ ప్రాంతంలోని పబ్లిక్ టాయిలెట్ల ని తెలిసికొనే వీలు.

గూగుల్ మ్యాప్స్ మరియు నావిగేషన్ యాప్ లో భారత్-నిర్దిష్ట లక్షణాలను  తీసుకువచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. ఇది అనుదిస్టంగా  ఎదురయ్యే సవాళ్లను మరియు అవకాశాలను పరిష్కరించేందుకు అమలు చేయబడుతోంది,అని  ఒక సీనియర్ కంపెనీ అధికారి ది ఎకనామిక్ టైమ్స్ కి తెలిపారు.

ప్రోగ్రాం మేనేజర్ అనిల్ ఘోష్ ఒక ప్రకటనలో ఇలా చెప్పారు , "గూగుల్ మ్యాప్స్ కేవలం A నుండి B కి వెళ్లడం గురించి మాత్రమే కాదు. మేము దీనిని భారతదేశం కోసం నిర్మించాము, ప్రత్యేకమైన సవాళ్లు మరియు అవకాశాలను ప్రసంగించడం, గూగుల్ మరింత సమగ్రమైన, కచ్చితమైన విశ్వసనీయతమైనది". ఈ విషయంపై ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, భారతదేశం కోసం ప్రత్యేకంగా అందించిన విశేషమైన లక్షణాలను గురించి ఘోష్ మాట్లాడారు. 

భారతదేశంలో గూగుల్ మ్యాప్స్ వినియోగదారులు ద్విచక్ర మోడ్ ని పొందుతారు. దేశంలో నమోదు అయిన అన్ని వాహనాల్లో 70 శాతం ద్విచక్ర వాహనాలు. "మ్యాప్ లో వున్న రెండు చక్రాల మోడ్ లో కార్లు, బస్సులు మరియు ట్రక్కులకు  అందుబాటులో లేని  సత్వరమార్గాలు ఉపయోగించే ట్రిప్ మార్గాలను చూపిస్తుంది. ఇది అనుకూలించిన ట్రాఫిక్ మరియు రాకడ  సమయ అంచనాలను అందిస్తుంది" అని ఘోష్ తెలిపారు.

గూగుల్ మ్యాప్స్ లో అందించిన రవాణా ఫీచర్లయిన  రైలు, మెట్రో మరియు బస్సు మార్గాల సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా, భారత రైల్వే చేత అందిన  సుమారుగా 12,000 రైళ్ళకు షెడ్యూల్లను చూపిస్తుంది. "మేము హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నాము. మేము దేశంలోని వేర్వేరు నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లను (గూగుల్ మ్యాప్స్ లో) జోడించడానికి వారితో కలిసి పనిచేస్తున్నాము "అని ఘోష్ వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వం తో భాగస్వామ్యంగా  పనిచేస్తూ, గూగుల్ పబ్లిక్ టాయిలెట్ స్థానాలను గూగుల్ మ్యాప్స్ లో చేర్చింది. బహుశా, దేశంలో ప్రబలమైన చెడు అపరిశుభ్రత సమస్యని మార్చడం గురించి, బహిరంగ మూత్రవిసర్జన యొక్క బెడదను తగ్గించడానికి ప్రయత్నంగా జరిగింది. 

"మేము కలకత్తా మరియు సూరత్, రెండు నగరాలలో వాస్తవ సమయ బస్సులను ప్రారంభించాము. ఇంకా దీనిని మేము ఇతర నగరాలకు ఎలా విస్తరించాలని   చూస్తున్నామని " ఘోష్ చెప్పారు. ఈ ఫీచర్లలో కొన్ని ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ యొక్క బీటా సంస్కరణలో అందుబాటులో ఉండవచ్చు మరియు స్థిరమైన వెర్షన్ వచ్చినప్పుడు  గూగుల్ వాటిని విడుదల చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo