గూగల్ ‘OnHub’ వైఫై రూటర్ లాంచ్

గూగల్ ‘OnHub’ వైఫై రూటర్ లాంచ్

గూగల్, రూటర్స్ ను తయారు చేసే TP – Link కంపెనీ తో కలిసి, స్మార్ట్ WiFi రూటర్ ను లాంచ్ చేసింది. దీని ధర 13,036 రూ. ఇది ప్రస్తుతానికి US, కెనడా దేశాలలో దొరుకుతుంది.

గూగల్ OnHub లోని ఫీచర్స్ ..

1. దీనిలో ఇంటర్నెల్ antenna లు ఉన్నాయి. వైర్స్ ఏమీ లేకుండా ఓపెన్ ప్లేస్ లో కూడా పెట్టుకునేందుకు వీలు అవుతుంది. దీని వలన సిగ్నల్ కూడా ఎక్కువుగా ఉంటుంది. సాధారణంగా wifi రూటర్స్ పై ఉండే బ్లింక్ అయ్యే led లైట్స్ దీనిలో చాలా చిన్న పాటి లైటింగ్ ఇస్తుంది.

2. దీని కోసం, Google On అనే మొబైల్ యాప్(ఆండ్రాయిడ్ అండ్ ios) కూడా ఉంది. bandwidth యూసేజ్, నెట్వర్క్ చెకింగ్ వంటివి ఎక్కడో పెట్టె రూటర్ వద్దకు వెళ్ళే అవసరం లేకుండా మొబైల్ లోనే చూసుకోవచ్చు. రూటర్ లో issue వచ్చినా, అది ఎటువంటి issue అనేది యాప్ చెబుతుంది…అలాగే సొల్యుషన్ కూడా ఇస్తుంది.

3. బ్యాక్ గ్రౌండ్ లో రాబోయే సిగ్నల్ బ్రేక్స్ ను ఎప్పుడూ వెతుకుతూ వాటిని రాకుండా చేస్తుంది అలాగే air waves లో ఏది మంచి స్పీడ్ తో ఉందో దానిని ఎంచుకుంటుంది రూటర్ ను సెట్ అప్ చేసేటప్పుడు.

4. మీరు డౌన్లోడ్స్ ఏమినా చేస్తుంటే మీ డివైజ్ కు హై ప్రియారిటీ సెట్ చేసుకోవచ్చు రూటర్ లో. సో అందరికన్నా మీకు ఎక్కువ స్పీడ్ షేర్ అవుతుంది.

5. రూటర్ వేడి ఎక్కకుండా వెర్టికల్ హీట్ సింక్ ద్వారా ఆటో కూలింగ్ సిస్టం ఉంది.

6. హై లైట్ విషయం ఏంటంటే OnHub కు ఆండ్రాయిడ్ మరియు క్రోమ్ బ్రౌజర్ వలే రెగ్యులర్ మరియు సెక్యురిటి అప్ డేట్స్ వస్తుంటాయి గూగల్ నుండి. మీరు రూటర్ కొని ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అయినా లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ వస్తుంటాయి.

 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo