Google Play Points: భారతీయులకు గూగుల్ గుడ్ న్యూస్.!

Updated on 13-Oct-2022
HIGHLIGHTS

భారతీయులకు గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది

Google Play Points అందుబాటులోకి తీసుకు వస్తోంది

ఇది యూజర్లకు ఉపయోగపడే రివార్డ్ ప్రోగ్రామ్

Google Play Points: భారతీయులకు గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే 28 దేశాలలో 100 మిలియన్లకు పైగా వినియోగదారులకు అందుబాటులో ఉన్న Google Play Points సర్వీస్ ను ఇప్పుడు భారతీయ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇది యూజర్లకు ఉపయోగపడే రివార్డ్ ప్రోగ్రామ్ మరియు గూగుల్ యూజర్ల కోసం రాబోయే వారంలో ఈ రివార్డ్ సిస్టమ్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అసలు ఈ గూగుల్ ప్లే పాయింట్స్ అంటే ఏమిటి మరియు ఈ పాయింట్స్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం!

Google Play Points: అంటే ఏమిటి?

గూగుల్ తన యూజర్లకు అందించే రివార్డ్ ప్రోగ్రామ్ Play Points మరియు వినియోగదారులు Google Play ని ఉపయోగించే అనేక మార్గాల్లో పాయింట్లు మరియు రివార్డ్‌లను సంపాదించడంలో ఇది సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, APPs, గేమ్స్ మరియు సబ్‌స్క్రిప్షన్లతో సహా Google Play తో చేసే కొనుగోళ్ల పైన కూడా వినియోగదారులు పాయింట్‌ లను సంపాదించగలరు. ఈ పాయింట్స్ జత చెయ్యబడిన తరువాత Play Credit గా రీడీమ్ చేయబడతాయి. మీరు వాటిని స్టోర్‌లో మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. రివార్డ్ ప్రోగ్రామ్‌లో నాలుగు స్థాయిలు ఉన్నాయి అవి : కాంస్య, వెండి, బంగారం మరియు ప్లాటినం.

Google Play Points: ఎలా ఉపయోగించాలి?

Google Play Points రివార్డ్ సిస్టమ్ ను ఉపయోగించడం చాలా సులభం మరియు మీరు అనుసరించవలసిన స్టెప్స్ క్రింద చూడవచ్చు.

ముందుగా, Google Play Store యాప్‌ని తెరవండి

ఎగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ పై నొక్కండి

ఇక్కడ Google Play Point కోసం అప్షన్ వస్తుంది

ఈ అప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సంపాదించిన మొత్తం పాయింట్స్ చూడవచ్చు

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :