Google: తెలుగుతో సహా 9 భాషల్లో Gemini AI App లాంచ్ చేసిన గూగుల్.!

Updated on 19-Jun-2024
HIGHLIGHTS

గూగుల్ ఈరోజు తెలుగు తో సహా 9 భాషల సపోర్ట్ తో Gemini AI App ని లాంచ్ చేసింది

జెమినీ ఎఐ ఇప్పుడు 9 భాషల సపోర్ట్ తో యాప్ రూపంలో కూడా భారత్ లో అందుబాటులోకి వచ్చింది

గూగుల్ జెమినీ మీకు నచ్చిన భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది

Google: టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు తెలుగుతో సహా 9 భాషల సపోర్ట్ తో Gemini AI App ని లాంచ్ చేసింది. ముందుగా వెబ్సైట్ సర్వీస్ గా మాత్రమే అందుబాటులో ఉన్న జెమినీ ఎఐ ఇప్పుడు 9 భాషల సపోర్ట్ తో యాప్ రూపంలో కూడా భారత్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందివచ్చింది. ఈ యాప్ ను అందుకోవడానికి iOS యూజర్లు మరికొన్ని రోజులు ఎదురు చూడవలసి వస్తుంది.

Gemini AI App

మంచి ఫలితాల కోసం చాలా కాలంగా పరీక్షల కోసం నిలబడిన జెమినీ AI ని ఇప్పుడు యాప్ రూపంలో భారత్ లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ని 9 భారతీయ భాషల సపోర్ట్ తో అందించింది. ఇందులో, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ మరియు గుజరాతీ భాషలు ఉన్నాయి.

Gemini AI App

అంటే, ఇప్పుడు కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా కావాల్సిన పనులు ఇట్టే చక్కబెట్టే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాప్ గూగుల్ జెమినీ మీకు నచ్చిన భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ యొక్క ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ జెమినీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త సామర్ధ్యాలు కూడా వచ్చి చేరాయి. ఇందులో డేటా విశ్లేషణ, ఫైల్ అప్లోడింగ్ వంటి కొత్త సామర్ధ్యాలు జత చేసింది. అంటే, గూగుల్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని భారత్ లోని అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Also Read: మీ Aadhaar History ఇప్పటి వరకూ చెక్ చేసుకోకపోతే.. ఇలా చెక్ చేసుకోండి.!

గూగుల్ జెమినీ AI తో ఏదైనా అంశాన్ని లేదా విషయాన్ని టైప్ చేసి లేదా వాయిస్ అసిస్టెంట్ లేదా ఇమేజ్ సాయంతో కూడా సెర్చ్ చేయవచ్చు. గూగుల్ జెమినీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా గూగుల్ యాప్ లో జెమినీ ట్యాబ్ ను నొక్కినా పొందవచ్చు. చాట్ చేయడం కోసం టైప్ చేసే పని లేకుండా జెస్ట్ మాట్లాడితే కూడా ఈ యాప్ అదే వాయిస్ ని డీకోడ్ చేసి టైపు చేసి మెసేజ్ లను అందిస్తుంది.

గూగుల్ జెమినీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో యాప్ పనులను మరింత సులభం చేస్తుంది మరియు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :