ఆండ్రాయిడ్ యాప్స్ ఇక నుండి chrome os లాప్ టాప్స్ లో

ఆండ్రాయిడ్ యాప్స్ ఇక నుండి chrome os లాప్ టాప్స్ లో

గూగల్ క్రోమ్ OS ను డెవలప్ చేసి, దానిని కేవలం chrome లాప్ టాప్స్ పైనే రన్ చేస్తున్న విషయం తెలిసినదే. అయితే ఈ os కేవలం ఇంటర్నెట్ పై పని ఉండే వారికీ బెస్ట్ సపోర్టింగ్.

ఎందుకంటే chrome లాప్ టాప్స్ లో ఎక్కువ స్టోరేజ్, స్పెసిఫికేషన్స్ ఏమీ ఉండవు. సింపుల్ గా ఉంటుంది. ఫాస్ట్ గా వర్క్ చేసుకునే వారికి ఎటువంటి unnecessary elements లేకుండా పనిచేస్తుంది.

వర్క్ ఉంటె ఓపెన్ చేయటం వర్క్ చేయటం, లోడింగ్ కు టైమ్ అదీ ఉండదు. ఇప్పుడు గూగల్ ఈ os కు ఆండ్రాయిడ్ యాప్స్ ను తెస్తుంది. గూగల్ అఫీషియల్ గా ఈ అనౌన్సుమేంట్ చేస్తింది Google I/O లో.

స్పీడ్, సింప్లిసిటీ అండ్ సెక్యురిటీ ఏమీ compromise కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ పై నడిచే యాప్స్ అన్నీ chrome os లో కూడా పనిచేస్తాయి ఇక నుండి అని తెలిపింది.

యాప్స్ అన్నీ గూగల్ ప్లే స్టోర్ యాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోగలరు. ముందుగా ఆసుస్ క్రోమ్ బుక్స్(Flip, Acer Chromebook R 11) పైన రానుంది. తరువాత Chromebook Pixel  లో జూన్ మధ్యలో వస్తుంది.  మిగిలిన క్రోమ్ డివైజెస్ కు వచ్చే సంవత్సరం రానున్నాయి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo