అప్లికేషన్ లను సెక్యూర్ గా ఉంచుకోవటానికి కొన్ని టూల్స్ ను వాడుకలోకి తెస్తుంది గూగల్. ధర్డ్ పార్టీ ఆప్స్ లోకి యూజర్స్ వాళ్ల గూగల్ ఎకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వటానికి ఇది మరిన్ని సులభమైన ఆప్షన్స్ తో పనిచేయనుంది.
ఈ మొత్తం పేకేజ్ లో మూడు టూల్స్ ఉన్నాయి. పాస్ వర్డ్స్ కోసం స్మార్ట్ లాక్, గూగల్ సైన్ ఇన్ మరియు గూగల్ ఐడెంటిటీ. ఒక అంతర్లీన పాస్వర్డ్ తో స్మార్ట్ లాక్ ఆండ్రాయిడ్ ఆప్స్ లోకి ఆటోమేటిక్ గా లాగిన్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇది క్రోమ్ లోని వెబ్ సైట్స్ లో లాగిన్ లను ఆటో ఫిల్ కూడా చేస్తుంది. ఇక ముందు మళ్ళీ వాటిని వాడుకునేందుకు స్మార్ట్ లాక్ థర్డ్ పార్టీ ఆప్స్ ను పాస్వర్డ్ సేవ్ చేయమని అడుగుతుంది.
గూగల్ సైన్ ఇన్ ఆప్స్ మరియు వెబ్ సైట్స్ కు సెక్యూర్ గా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపదతుంది. గూగల్ సైన్ ఇన్ కారణంగా తమ వెబ్ సైటు కి కొత్తగా యూజర్స్ ఎప్పుడూ లేని విధంగా ఎక్కువుగా వస్తున్నారు అని చెప్పుకొచ్చింది, New York Times.
గూగల్ ఐడెంటిటీ టూల్ కిట్ ద్వారా నాన్ టెక్నికల్ యూజర్స్ సింపుల్ కన్ఫిగరేషన్ తో అతేన్టికేషన్ లాగిన్ లను సపోర్ట్ చేస్తుంది. తాజగా గూగల్ 'My Account Dashboard' పేరుతో ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ ను అనౌన్స్ చేసింది. ఇందులో యూజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవెసి సెట్టింగ్ లను క్లారిటీ గా వాడుకునేందుకు ఇన్ఫర్మేషన్ అంతా జోడించి వివరించింది గూగల్. గత సంవత్సరం లో గూగల్ అన్ని జి మెయిల్ మెసేజ్ లకు ఎన్క్రిప్షన్ ను అనౌన్స్ చేసింది. ఇది అంతా చూస్తుంటే గూగల్ సెక్యురిటీ పరమైన ఇబ్బందులను వినియోగదారులు ఎదుర్కోకుండా ఉండేందుకు చేస్తున్న చిన్న చిన్న పెద్ద మార్పులు.
ఆధారం: గూగల్