సైబర్ అటాక్స్ కి అడ్డుకట్టగా Google Threat Intelligence తెచ్చిన గూగుల్.!
Google Threat Intelligence ని ప్రకటించింది
శాన్ఫ్రాన్సిస్కో లో జరిగిన RSA Conference నుండి ఈ గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ని ప్రకటించింది
వైరస్ లను పసిగట్టడానికి 5 అంచెల ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది అని గూగుల్ తెలిపింది
పెరుగుతున్న టెక్నాలజీ తో పాటు దీన్ని తప్పుగా ఉపయోగించి చేసే మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది ‘సైబర్ అటాక్’ అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పవచ్చు. అందుకే, సైబర్ ఎటాక్స్ ను నిలువరించడానికి మరియు నియంత్రించడానికి ప్రతి కంపెనీ కూడా వారి టీమ్స్ ను రెడీగా ఉంచుకుంటుంది. అయితే, సైబర్ ఎటాక్స్ ని అడ్డుకోవడానికి సహాయంగా సైబర్ అటాక్స్ కి అడ్డుకట్ట వేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ‘Google Threat Intelligence’ ని తీసుకు వచ్చినట్లు, గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు.
ఏమిటి ఈ Google Threat Intelligence?
గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది Gemini AI సహకారంతో గూగుల్ అందిస్తున్న యాక్షనబుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్. మే 7వ తేదీ శాన్ఫ్రాన్సిస్కో లో జరిగిన RSA Conference నుండి ఈ గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ని ప్రకటించింది.
Google Threat Intelligence ఎలా పని చేస్తుంది?
ఈ కొత్త గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది సైబర్ ఎటాక్స్ మరియు వైరస్ లను పసిగట్టడానికి 5 అంచెల ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది అని గూగుల్ తెలిపింది. ఇందులో Google threat insights, Frontline intelligence, Human-curated threat intelligence, crowdsourced threat intelligence మరియు Open-source threat intelligence ఉంటాయి.
అంతేకాదు, గూగుల్ AI Driven ఆపరేషనలైజేషన్ తో చాలా వేగంగా రెస్పాండ్ అవుతుంది మరియు వేగంగా సమస్యల మూలాలను పసిగట్టడంలో ముందుంటుందని చెబుతోంది. దీనికోసం Gemini AI సహాయం చేస్తుందని మరియు కంజ్యూమర్ లు పెద్ద డేటా సెట్స్ సైతం సెకండ్స్ లో చెక్ చేసుకోవచ్చని చెబుతోంది.
Also Read: Amazon Mega TV Days Sale: వన్ ప్లస్ QLED పైన 30 వేల డిస్కౌంట్ అందుకోండి.!
‘ గ్లోబల్ థ్రెట్స్ పైన మంచి విజిబిలిటీ కోసం సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ సహాయం చేయడానికి నుండి googlecloud నుండి గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ను లాంచ్ చేసినట్లు, సుందర్ పిచాయ్ తన X అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. ఇది Gemini యొక్క అడ్వాన్స్డ్ AI సత్తా, Mandiant మరియు Virustotal నుండి ఇన్ సైట్స్ మరియు ఎక్స్ పర్టైజ్ ని తీసుకుంటుందని తెలిపారు.