భారతీయులకు Google గుడ్ న్యూస్.. ఇక ప్రతిదానికి పాయింట్లు పొందండి.!

Updated on 17-Oct-2022
HIGHLIGHTS

భారతీయులకు Google గుడ్ న్యూస్

Google Play Points ద్వారా వినియోగదారులకు పాయింట్స్ అందిస్తుంది

గూగుల్ యొక్క ఈ రివార్డ్ ప్రోగ్రాం ఇప్పటికే 28 దేశాలలో అందుబాటులో వుంది

భారతీయులకు Google గుడ్ న్యూస్. అదే, Google Play Points మరియు ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులకు పాయింట్స్ అందిస్తుంది. గూగుల్ యొక్క ఈ రివార్డ్ ప్రోగ్రాం ఇప్పటికే 28 దేశాలలో అందుబాటులో వుంది. అయితే, ఇప్పుడు ఈ గూగుల్ ప్లే పాయింట్స్ ప్రోగ్రామ్ ను భారతీయ యూజర్లకు కోసం తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు ఉపయోగపడే రివార్డ్ ప్రోగ్రామ్. వచ్చే వారాల్లో ఈ రివార్డ్ సిస్టమ్‌ను గూగుల్ ఇండియాలో విడుదల చేయడం ప్రారంభిస్తుంది. గూగుల్ తీసుకువస్తున్న ఈ కొత్త రివార్డ్ ప్రోగ్రామ్ ఏమిటో చూద్దామా.  

Google Play Points: అంటే ఏమిటి?

గూగుల్ తన యూజర్లకు అందించే రివార్డ్ ప్రోగ్రామ్ Play Points మరియు వినియోగదారులు Google Play ని ఉపయోగించే అనేక మార్గాల్లో పాయింట్లు మరియు రివార్డ్‌లను సంపాదించడంలో ఇది సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, APPs, గేమ్స్ మరియు సబ్‌స్క్రిప్షన్లతో సహా Google Play తో చేసే కొనుగోళ్ల పైన కూడా వినియోగదారులు పాయింట్‌ లను సంపాదించగలరు. ఈ పాయింట్స్ జత చెయ్యబడిన తరువాత Play Credit గా రీడీమ్ చేయబడతాయి. మీరు వాటిని స్టోర్‌లో మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. రివార్డ్ ప్రోగ్రామ్‌లో నాలుగు స్థాయిలు ఉన్నాయి అవి : కాంస్య, వెండి, బంగారం మరియు ప్లాటినం.

Google Play Points: ఎలా ఉపయోగించాలి?

Google Play Points రివార్డ్ సిస్టమ్ ను ఉపయోగించడం చాలా సులభం మరియు మీరు అనుసరించవలసిన స్టెప్స్ క్రింద చూడవచ్చు.

ముందుగా, Google Play Store యాప్‌ని తెరవండి

ఎగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ పై నొక్కండి

ఇక్కడ Google Play Point కోసం అప్షన్ వస్తుంది

ఈ అప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సంపాదించిన మొత్తం పాయింట్స్ చూడవచ్చు

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :