'Brillo’ అనే పేరుతో గూగల్ సరికొత్త OS ను నిర్మిస్తుంది. ఇది లో పవర్డ్ ఇంటర్నెట్ డివైజ్ లకు ప్లాట్ఫారం గా తయారవుతుంది. త్వరలో రాబోవు I/O డెవెలపర్స్ కన్ఫిరెన్స్ లో దిని గురించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. నివేదికల ప్రకారం బ్రిల్లో OS 64 మరియు 32 MB ర్యామ్ లకు బాగా పనిచేస్తుంది.
బ్రిల్లో os సాఫ్టవేర్ ఆండ్రాయిడ్ ఆధారితమైనది. బ్రిల్లో సాఫ్టవేర్ సేన్సార్స్ మరియు డాంగల్స్ పై కూడా పనిచేయనుంది. ఇది ఇంటిలోని వాడబడే ఫ్రిడ్జ్, లైట్స్ మరియు గార్డెన్ మానిటర్స్ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ లకు బాగా ఉపయోగపడుతుంది. అన్ని స్మార్ట్ డివైజ్ లకు సంబందించిన సాఫ్టవేర్ కారణం తో గూగల్ దీనిని ప్రియారిటి గా తీసుకోని పనిచేయటం జరగుతుంది. దీనితో పాటు గూగల్ ఆండ్రాయిడ్ వేర్ కి సంబందించిన ఆండ్రాయిడ్ M os పై కూడా అనౌన్సుమెంటు చేయనుంది.
ఇదే కోవలో Huawei కూడా LiteOS పేరుతో తాజాగా చైనా లో కొత్త os ను అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ లైట్ వెయిట్ os లు మన నిత్య వాడుక కు సంబందించిన పరికరాలను తయారు చేసే కంపెనీలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు వాళ్ళ డివైజుల్లో కనెక్టివిటీ ని నిర్మించే అవకాశాన్ని ఈ లైట్ వెయిట్ os లు ఇవనున్నాయి. ఇదే కోవలో ఈ నెల మొదట్లోనే సామ్సంగ్ Artik లైన్ హార్డ్వేర్ ను ప్రవేసపెట్టింది. ఇది కూడా వేరేబల్స్ మరియు స్మార్ట్ డివైజ్ లు కి మంచి ప్లాట్ఫారం గా ఉండనుంది. గార్ట్నర్ రిపోర్ట్స్ ప్రకారం 2009 లో ఉన్న 900 మిలియన్ నెట్వర్క్ కనెక్టివిటీ డివైజ్ ల సంఖ్య 2020 సంవత్సరంకి అల్లా 26 బిలియన్ కు పెరగనున్నాయి. ఇంటర్నెట్ కు అనుసందించి సెన్సార్లు మరియు ఇతర ఇంటర్నెట్ టెక్నాలజీనిల సహాయం తో పనిచేసే స్మార్ట్ డివైజ్ ల పై ఇప్పుడు అన్ని కంపెనీలు పోటి పడి మరి పనిచేయనున్నాయి. IDC రిసర్చ్ ప్రకారం ఈ మార్కెట్ 2020 కి అల్లా $3.04 ట్రిలియన్ల కు పెరగనుంది.
ఆధారం: The Information