Google Play Store నుంచి 23 లక్షలకు పైగా ప్రమాదకరమైన యాప్స్ బ్యాన్.!

యూజర్ సెక్యూరిటీ కోసం గూగుల్ కొత్త AI టెక్నాలజీని ఉపయోగిస్తోంది
Google Play Store నుంచి లక్షల కొద్దీ యాప్స్ తొలగింపు
వాటిని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేసినట్లు కూడా తెలిపింది
ఆండ్రాయిడ్ యూజర్ సెక్యూరిటీ కోసం గూగుల్ కొత్త AI టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ కొత్త ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో Google Play Store నుంచి గూగుల్ లక్షల కొద్దీ యాప్స్ ను తొలగించడం జరిగినట్లు కూడా చెబుతోంది. గూగుల్ ప్లే స్టోర్ యొక్క పాలసీలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఈ యాప్స్ ను తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. ఈ చర్య ద్వారా గూగుల్ ఎకో సిస్టమ్ ను మరింత సమర్థవంతంగా మరియు సెక్యూర్ గా మార్చినట్లు తెలుస్తోంది.
Google Play Store
యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2.3 మిలియన్, అంటే 23 లక్షలకు పైగా ప్రమాదకరమైన యాప్స్ ను గూగుల్ తొలగించినట్లు స్పష్టం చేసింది. ఈ యాప్స్ ని రివ్యూ చేసే సమయంలో వాటిని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేసినట్లు కూడా తెలిపింది. యాప్స్ లో ఉన్న మాల్వేర్ మరియు స్పైవేర్ ను గుర్తించడంలో దాదాపు 92% శాతం AI సహాయం చేసినట్లు కూడా గూగుల్ వెల్లడించింది.
ప్రస్తుతం, హ్యూమన్ రివ్యూవర్స్ AI సహాయంతో చాలా త్వరగా మరియు మరింత ఖచ్చితత్వంతో మాల్వేర్ మరియు స్పైవేర్ కలిగిన ప్రమాదకరమైన యాప్స్ ను పసిగడుతున్నట్లు గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. గూగుల్ ప్లే ని సమర్ధవంతంగా మార్చడానికి AI ఆధారిత థ్రెట్ డిటెక్షన్ ను గూగుల్ అవలంభిస్తోంది.
Also Read: Budget 2025: స్మార్ట్ ఫోన్ రేట్ల పై కొత్త బడ్జెట్ ప్రభావం చూపుతుందా.!
యూజర్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ మరింత గొప్పగా మార్చడానికి మరియు యూజర్ సేఫ్టీ కోసం గూగుల్ యొక్క ప్లే ప్రొటెక్ట్ స్కానర్ ప్రతి రోజు 200 బిలియన్ యాప్స్ ను స్కాన్ చేస్తుంది. అంతేకాదు, కొత్త యాప్స్ లో దాగి ఉండే పోలీమార్ఫిక్ మాల్వేర్ తో పోరాడటానికి ఇది రియల్ టైం లో కోడ్ లెవల్ స్కానింగ్ ను కూడా కొనసాగిస్తుందని, గూగుల్ ఈ పోస్ట్ లో వెల్లడించింది.