గూగల్ 'టాప్ 10 క్రిమినల్స్ లిస్టు' లో మోడీ ఫోటో వచ్చింది. అనుకోకుండా వచ్చింది అంటూ గూగల్ మోడీ ను ఈ విషయం పై క్షమాపణలు కూడా కోరింది.
బ్రిటిష్ డైలీ దగ్గర మోడీ గురించి తప్పుడు సమాచారం ఉండటం వలన ఇలా జరిగింది అని చెప్పింది గూగల్. మోడీ గతంలో పొలిటికల్ స్పిచేస్ లో క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పొలిటిషియన్స్ గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన మోడీ ఫోటోలు అక్కడి నుండి వచ్చాయి అని చెబుతుంది గూగల్. అయితే ఈ లిస్టు లో మోడీ తో పాటు కనిపించిన వారిలో దావూద్ ఇబ్రహీం, హాఫిజ్ సయ్యాద్, స్లేయన్ అల్ కైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, ఆయ్మన్ అల్-జవహిరి, బిల్ గేట్స్ మరియు డిల్లి చీఫ్ మినిస్టర్, అరవింద్ క్రేజివాల్ ఉన్నారు. క్రిమినల్ లిస్టు లో మోడీ పేరు రావటంతో, మోడీ సపొర్టర్స్ ట్విట్టర్ లో తమ కోపాన్ని ప్రదర్శించగా ఇంటర్నెట్ అధినేత, గూగల్ క్షమాపణలు ఇచ్చింది.
గూగల్ స్పోక్స్ పర్సెన్, "ఈ రిజల్ట్స్ గూగల్ ఒపీనియన్స్ కాదు, టెక్నికల్ కారణాల వలన జరిగిన ఈ రాంగ్ లిస్టు రావటం విషయం లో మేము క్షమాపణ చెబుతున్నాం" అని స్టేట్మెంట్ ఇచ్చారు. బుధవారం చోటుచేసుకున్న ఈ కన్ఫుజన్ ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అయ్యింది. గూగల్ తమ సెర్చ్ అల్గారిథంస్ ను మార్చే ప్రయత్నాలలో ఉంది.
ఆధారం: The Hindu