గూగల్ Hangouts ఇప్పుడు సెపరేట్ గా వెబ్ సైట్ రూపంలో
ప్లగ్ ఇన్స్ మరియు జి మెయిల్ అకౌంట్ సైన్ in అవకుండా చాట్ చేసుకోవటానికి
గూగల్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన గూగల్ ప్లస్ పేజ్ లో hangouts మెసెంజర్ కు సెపరేట్ వెబ్ సైటు ను డెవలప్ చేసినట్టు అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఇంటర్నెట్ లో గూగల్ hang outs కు ఒక స్వతంత్ర పేజ్ ఉంది. బహుశా ఇది వాట్స్ అప్, టెలిగ్రాం వంటి వాటికి డెస్క్ టాప్ లో సైటు ఉంది అని డెవలప్ చేసినట్టు ఉంది.
hangouts.google.com లోకి వెల్లి మీరు అక్కడ సైన్ in అయితే చాలు, జి మెయిల్ లేదా బ్రౌజర్ ప్లగ్ ఇన్స్ వంటివి అవసరం లేదు అని చెబుతుంది గూగల్. చాటింగ్, కాలింగ్, కాంటాక్ట్స్ డయిలింగ్ మరియు వీడియో కాలింగ్ కూడా దీని నుండి చేయగలరు.
ఇప్పటివరకూ గూగల్ లో చాట్ చేయటానికి గూగల్ ప్లస్, జి మెయిల్ మరియు బ్రౌజర్ ప్లగ్ ఇన్స్ ఉండేవి, ఇప్పుడు డైరెక్ట్ వెబ్ సైటు వచ్చింది. అయితే చాలా మంది దీనిని వాడటం తగ్గించేసారు. తాజగా లాలిపాప్ os తో గూగల్ టాక్ నుండి hang outs అని పేరు మార్చి స్టాండర్డ్ sms మెసేజింగ్ చేసుకోవటానికి కూడా ఆప్షన్ ఇచ్చినా పెద్దగా యూజర్స్ ను ఆకట్టుకోలేదు.
అయితే ఆండ్రాయిడ్ మరియు మిగలిన మొబైల్ os లలో ఉండే ఈ hang outs ను sms లకు యాక్టివేట్ చేసుకుంటే అనవసరమైన నెట్వర్క sms లను బ్లాక్ చేసే విధంగా "Block" మరియు "mute" వంటి మంచి ఆప్షన్స్ ను ఇస్తుంది. గూగల్ hangouts ఇంటర్నెట్ వెబ్ సైటు కు వెళ్లటానికి ఈ లింక్ పై ప్రెస్ చేయండి.