పిక్సెల్ C టాబ్లెట్ అండ్ క్రోమ్ కాస్ట్ డివైజెస్ లాంచ్ చేసిన గూగల్

Updated on 30-Sep-2015
HIGHLIGHTS

నేక్సాస్ ఈవెంట్ లోనే ఇవి కూడా లాంచ్ అయ్యాయి.

క్రోమ్ కాస్ట్ డివైజెస్

క్రోమ్ కాస్ట్ అంటే మీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, లాప్టాప్ లోని కంటెంట్ ను మీ ఇంటిలో HDTV లో చూపిస్తుంది. అంటే HDMI కనెక్టివిటి ఉండే స్ట్రీమింగ్ డివైజ్. జస్ట్ usb పెన్ డ్రైవ్ లా ఉంటుంది. WiFi సపోర్ట్ తో వస్తుంది. గూగల్ క్రోమ్ కాస్ట్ డివైజెస్ ను అనౌన్స్ చేసింది నిన్న జరిగిన ఈవెంట్ లో. అయితే ఈ సారి క్రోమ్ కాస్ట్ తో పాటు క్రోమ్ కాస్ట్ ఆడియో ను కూడా తెచ్చింది. 

కొత్త క్రోమ్ కాస్ట్ లో కొత్త డిజైన్, ఇంటిగ్రేటెడ్ HDMI కేబుల్, ఇంప్రూవ్డ్ WiFi బాండ్ సపోర్ట్ ఉన్నాయి. ఇది lemonade, బ్లాక్ అండ్ కోరల్ కలర్స్ లో వస్తుంది.దీనిలో కొట్టగా కంటెంట్ డిస్కవరీ, ఫాస్ట్ ప్లే, రిమోట్ డిస్ప్లే, కాస్ట్ గేమ్స్ ఉన్నాయి.

రెండవది క్రోమ్ కాస్ట్ ఆడియో. క్రోమ్ కాస్ట్ ఆడియో అనేది ఇంటిగ్రేటెడ్ 3.5mm జ్యాక్ అండ్ RCA/ఆప్టికల్ కేబుల్ ఉన్న WiFi రిసీవర్/రూటర్. ఇది ఇంట్లో ఉండే ఎటువంటి హోమ్ స్పీకర్ ను అయినా స్మార్ట్ మ్యూజిక్ సిస్టం లా మారుస్తుంది.

క్రోమ్ కాస్ట్ ఆడియో కు ఆండ్రాయిడ్ వేర్ సపోర్ట్, మల్టీ ఫోన్ కాస్ట్ synchronisation, మల్టీ స్పీకర్ ఆడియో డిస్ట్రిబ్యూషన్, మేజర్ మ్యూజిక్ స్ట్రిమింగ్ యాప్స్ సపోర్ట్ ఉన్నాయి.

రెండు క్రోమ్ కాస్ట్ డివైజెస్ 17 దేశాలలో సేల్ అవుతున్నాయి. ధర 2,300 రూ. క్రోమ్ కాస్ట్ ముందు మోడల్స్ ఇప్పటివరకూ 20 మిలియన్ డివైజెస్ సేల్ అయ్యాయి గ్లోబల్ గా.
 

నేక్సాస్ గూగల్ పిక్సెల్ C టాబ్లెట్

నిన్న జరిగిన గూగల్ ఈవెంట్ లో లాస్ట్ గా చూపించిన డివైజ్, పిక్సెల్ C టాబ్లెట్. దీని పేరులో C అంటే convertible. దీని ధర 33,000 నుండి స్టార్ట్ అవుతుంది.

స్పెక్స్ – 10.2 in డిస్ప్లే సైజ్, NVIDIA x1 క్వాడ్ కోర్ ప్రొసెసర్, మాక్స్వెల్ గ్రాఫిక్స్, రెండు వైపులా స్టీరియో స్పీకర్స్, నాలుగు మైక్రో ఫోన్స్, సెల్ఫ్ aligning మాగ్నెటిక్ లిస్ప్స్ తో అటాచ్ అయ్యే కీ బోర్డ్.

32gb ఇంబిల్ట్ స్టోరేజ్ నేక్సాస్ పిక్సెల్ C టాబ్లెట్ ధర 33,000 రూ. 64 gb ఇంబిల్ట్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర 39,500 రూ.

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :