ChromeBit పేరుతో కొత్త usb PC కంప్యుటర్ లాంచ్ చేసిన గూగల్ – ఆసుస్
గూగల్ మరియు ఆసుస్ సంయుక్తంగా Chromebit ను లాంచ్ చేశారు. ఇది usb స్టిక్ మీద రన్ అయ్యే పర్సనల్ కంప్యుటర్. అంటే ప్రస్తుతం వాడుకలో ఉండే పెద్ద CPU లు ఉండవు.
క్రోమ్ బిట్ pc స్టిక్, క్రోమ్ OS పై రన్ అవుతుంది. దీనిలో 2gb ర్యామ్, 16gb ఆన్ బోర్డ్ స్టోరేజ్, rockchip ప్రొసెసర్, usb పోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.0 ఉన్నాయి. బరువు 75 గ్రా.
దీనిని ఏదైనా డిస్ప్లే (మానిటర్, టీవీ, ప్రొజెక్టర్) వంటి డివైజెస్ కు hdmi పోర్ట్ సహాయంతో తో కనెక్ట్ చేయగలరు. సో కంప్యుటర్ కూడా టీవీ లతో వాడుకోవచ్చు. ప్రత్యేకంగా పెద్ద cpu ఉండదు. అంతా ఆ స్టిక్ లోనే ఉంటుంది.
అయితే వైర్ లెస్ కీ బోర్డ్ అండ్ మౌస్ ఉండాలి. సో కంప్లీట్ గా వాడుకోగలరు. దీని ప్రైస్ 5,600 రూ. ఇది ప్రస్తుతం ఇండియాలో రిలీజ్ కాలేదు. ఎప్పుడు వస్తుంది అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.
కాని క్రోమ్ os అంటే ఇది ఇంటర్నెట్ ఎక్కువుగా ఉండే వారికి మాత్రమే కరెక్ట్. అన్నీ వెబ్ యాప్స్ మాత్రమే ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి pc usb స్టిక్స్ లాంచ్ అయ్యాయి.
ఇంటెల్ కంప్యూట్ స్టిక్ (9,999 రూ ), InFocus kangaroo (6,500 రూ). ఈ రెండూ విండోస్ os పై రన్ అవుతాయి.