వరల్డ్ సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా గూగల్ జిమెయిల్ లో కొత్త సెక్యురిటీ ఫీచర్స్ ను అందిస్తుంది. ట్రాన్స్ పోర్ట్ లేయర్ సెక్యురిటీ TLS ఎన్క్రిప్షన్ లేని మెయిల్స్ ను ఐడెంటిఫై చేసి చేబుతుంది అంటే FLAG చేస్తుంది.
అంటే sender అండ్ రిసీవర్ మధ్యన ఈమెయిలు రూపంలో డేటా(పాస్ వర్డ్స్ or anything ఇంపార్టెంట్) ట్రాన్స్ ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో hackers వంటి వారికీ డేటా కనపడకుండా ఉండటానికి ఇది.
ఎన్క్రిప్షన్ సపోర్ట్ లేకుండా ఉన్న మెయిల్ id లను ఎంటర్ చేయగానే టాప్ రైట్ సైడ్ రెడ్ broken లాక్ ఐకాన్ ను చూపిస్తుంది జిమెయిల్. అంటే వారికీ ఎన్క్రిప్షన్ సపోర్ట్ లేదని అర్థం. వారికీ లేదని తెలిసినప్పుడు మీరు ఇంపార్టంట్ డేటా ను పంపటం మనేయమని లేదా ఆ యూసర్ కు పంపొద్దని చెబుతుంది కొత్త సెక్యురిటీ ఫీచర్ .
దానిపై క్లిక్ చేసి మరింత సమాచారం అక్కడే చిన్న బాక్స్ లో తెలుసుకోగలరు. ఎన్క్రిప్షన్ సపోర్ట్ లేకపోతె మీరు పంపే డేటా ను మధ్యలో ఎవరైనా ఈజీగా తెలుసుకోగలరు.
అలాగే ఐడెంటిఫై అవ్వని యూసర్ id ల నుండి వచ్చే మెయిల్స్ ను కూడా ఫ్లాగ్ చేస్తుంది. ఇలాంటి మెయిల్స్ ను గుర్తించటానికి కంపెని మెయిల్ కాంటాక్ట్ ఫోటో వద్ద question మార్క్ సింబల్ ఇస్తుంది.
ఇది ఓవర్ ఆల్ గా మీకు తెలియని మెయిల్స్ కు రిప్లై ఇచ్చే ముందు, లేదా మెయిల్స్ లో ఉన్న లింక్స్ ను క్లిక్ చేసే ముందు యూసర్ కు ఆ మెయిల్ ఎంత సెక్యూర్ గా ఉంది అని తెలియజేయటానికి.