Goolge కొత్త ఆలోచన: ఇంటిలో కూర్చొనే ప్రపంచం చుట్టేయండి.!
గూగుల్ మ్యాప్స్ లో మరొక కొత్త ఫీచర్
గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా 'Immersive View'
రోడ్స్ మరియు వాతావరణ వివాలను మీ ఇంట్లో కూర్చొనే చేసే వీలుంటుంది
టెక్ దిగ్గజం గూగుల్ ప్రజలకు అందించని సర్వీస్ లేదు. ఇందులో, ఇప్పుడు గూగుల్ మరొక కొత్త ఫీచర్ ను గూగుల్ మ్యాప్స్ లో తీసుకువస్తున్నట్లు తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్లకు మార్గాల వేటలో నిత్యం సహాయం చేసే గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా 'Immersive View' ని జత చేస్తున్నట్లు, దీని ద్వారా రోడ్స్ మరియు ఏరియా లను చాలా స్పష్టంగా మరియు మరింత ఖచ్చిత వివరాలతో చూడవచ్చని, గూగుల్ తెలిపింది. రీసెంట్ గా జరిగిన Google I/O 2023 నుండి ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు.
Immersive View
new from #GoogleIO: preview your whole journey before you go with Immersive View for routes pic.twitter.com/1lRp1HvgKl
— Google Maps (@googlemaps) May 10, 2023
గూగుల్ మ్యాప్స్ లో త్వరలోనే ఈ కొత్త ఇమ్మర్సివ్ వ్యూ ని చూడవచ్చని కూడా ఈ Google I/O 2023 నుండి పిచాయ్ పేర్కొన్నారు. ఈ కొత్త ఫీచర్ తో మీరు చేయబోయే జర్నీ కి సంబంధించి అన్ని వివరాలు మరియు రియల్ టైం ఇమ్మెర్సివ్ వ్యూ ని అందిస్తుంది. ఈ వ్యూ ఎలా ఉంటుందని కూడా గూగుల్ ఉదాహరించింది. ఈ వ్యూ ఎలా ఉంటుందో అని గూగుల్ ట్వీట్ లో క్రింద చూడవచ్చు.
From Street View New Immersive View for routes in @GoogleMaps#GoogleIO pic.twitter.com/CMdR697hwm
— Google (@Google) May 10, 2023
ఈ కొత్త ఇమ్మర్సివ్ వ్యూ, ఇప్పటి వరకు మనకు పరిచయం ఉన్న సంప్రదాయ మ్యాప్స్ మాదిరిగా కాకుండా రోడ్స్, బిల్డింగ్స్ మరియు వాతావరణ అప్డేట్స్ తో సహా కంప్లీట్ వివరాలను అందిస్తుంది. ఒకవేళ మీరు ఇతర దేశాలకు ట్రిప్ కోసం వెళ్లాలని అనుకుంటే, మీరు అక్కడి ఏరియాలు, రోడ్స్ మరియు వాతావరణ వివాలను మీ ఇంట్లో కూర్చొనే చేసే వీలుంటుంది.