ప్రసుత నవీన యుగంలో ఒకరి అడ్రెస్స్ లేదా ఏదైనా కొత్త చోటుకు వెళ్ళాలంటే Google Maps ఉంటే సరిపోతుంది. అంతగా, గూగుల్ మ్యాప్స్ తన సర్వీస్ ను విస్తరించింది మరియు ప్రాచుర్యాన్ని పొందింది. స్మార్ట్ ఫోన్ ఏదైనా గూగుల్ మ్యాప్స్ ను ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే మరియు అంతగా ఉపయోగపడుతుంది కూడాను. అంత ప్రాముఖ్యత కలిగిన గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఉపయోగకరమైన ఫీచర్లను గూగుల్ జత చేసింది.
గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా కీ లొకేషన్ కంట్రోల్స్ కి యాక్సెస్ ఫీచర్ ను అందించింది. దీనితో పాటుగా యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందించే టైం లైన్ ఫీచర్ ను కూడా తీసుకు వచ్చింది. ఈ రెండు కొత్త ఫీచర్లతో యూజర్లకు మంచి ఉపయోగాలు కూడా ఉంటాయి.
Also Read : iQOO 12 5G Launched: ఈ టాప్ 5 ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో వచ్చింది.!
ముందుగా, గూగుల్ మ్యాప్ లో తీసుకు వచ్చిన టైమ్ లైన్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్స్ గత లొకేషన్స్ ఉన్న ఎక్స్ పీరియన్స్ ను వారి డివైజ్ లో నేరుగా సేవ్ చేసుకోవచ్చు. అంటే, మీరు గతంలో సందర్శించిన వాటిలో ఈకు నచ్చిన లొకేషన్ మరియు అక్కడి మీరు పొందిన ఎక్స్ పీరియన్స్ ను మీ ఫోన్ లో నేరుగా మరియు క్లౌడ్ లో కూడా సేవ్ చేసుకోవచ్చన్న మాట.
అంతేకాదు, ఇది పూర్తిగా ఎన్క్రిప్టెడ్ చేయడుతుందని కూడా గూగుల్ చెబుతోంది. వాస్తవానికి, గత వివరాలు మరియు మెమొరీస్ ను పదిలంగా దాచుకోవాలని చూసే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ అందిస్తున్న ఈ కొత్త టైమ్ లైన్ ఫీచర్ తో మరొక ఉపయోగం కూడా ఉంది. అదేమిటంటే, ఈ డేటా మొత్తం క్లౌడ్ లో స్టోర్ చేసుకునే వారు కొత్త ఫోన్ కు మారినప్పుడు ఈ మొత్తం వివరాలను కొత్త ఫోన్ లో అందుకోవచ్చు.
గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ మ్యాప్స్ కి మరింత కంట్రోల్స్ కోసం బ్లూ డాట్ ను అందిస్తోంది. ఈ కొత్త అప్డేట్ ఫీచర్ ద్వారా బుల్ డాట్ ను టచ్ చేయడం ద్వారా కీ లొకేషన్ కంట్రోల్స్ కోసం మరింత సులభమైన యాక్సెస్ అందిస్తుంది. ఈ కీ లొకేషన్ కంట్రోల్స్ డివైజ్ లొకేషన్ టాప్ పాటుగా లొకేషన్ హిస్టరీ మరియు టైమ్ లైన్ సెట్టింగ్స్ ను కూడా ఇన్స్టాంట్ గా అందిస్తుంది.