Gold Live Update: ఈరోజు డౌన్ ట్రేడింగ్ తో మొదలైన గోల్డ్ మార్కెట్.!

Updated on 13-Feb-2023
HIGHLIGHTS

ఈరోజు డౌన్ ట్రేడింగ్ తో మొదలైన గోల్డ్ మార్కెట్

గత వారం మిశ్రమ ఫలితాలను కనబర్చిన గోల్డ్ మార్కెట్

ఈ వారం మొదటి రోజైన సోమవారం డౌన్ ట్రేడింగ్ తో ప్రారంభమయ్యింది

Gold Live Update: ఈరోజు డౌన్ ట్రేడింగ్ తో మొదలైన గోల్డ్ మార్కెట్. గత వారం మిశ్రమ ఫలితాలను కనబర్చిన గోల్డ్ మార్కెట్, ఈ వారం మొదటి రోజైన సోమవారం డౌన్ ట్రేడింగ్ తో ప్రారంభమయ్యింది. అయితే, ఇది చెప్పుకోదగిన మొత్తంలో తగ్గింపును మాత్రం నమోదు చెయ్యలేదు. కానీ, ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ హై రేట్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ తెలుసుకోండి.     

Gold Live Update:

గత వారంతంలో రూ.52,600 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.52,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,230 నుండి 150 రూపాయలు క్రిందకు దిగి రూ.57,230 రూపాయల వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,230 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,230 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,380 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :