మెల్లగా పైకి ఎగబాకుతున్న బంగారం.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందంటే..!

మెల్లగా పైకి ఎగబాకుతున్న బంగారం.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందంటే..!
HIGHLIGHTS

ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పైకి ఎగబాకింది

గత వారం మొత్తం స్తబ్దుగా ఉన్న బంగారం మార్కెట్ మెల్లగా ఊపందుకుంటోంది

రెండు రోజుల్లోనే బంగారం ధర 900 రూపాయలకు పైగా పెరిగింది

ఈరోజు కూడా మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పైకి ఎగబాకింది. గత వారం మొత్తం స్తబ్దుగా ఉన్న బంగారం మార్కెట్ మెల్లగా ఊపందుకుంటోంది. ఇక ఈ వారంలో కేవలం ఈ రెండు రోజుల్లోనే బంగారం ధర 900 రూపాయలకు పైగా పెరిగింది. నిన్న మర్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 650 రూపాయలు పెరగగా, ఈరోజు 280 రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. మరి ఈరోజు దేశరాజధానితో సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మార్కెట్ లో కొనసాగుతోందో తెలుసుకుందాం.

నిన్న మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉండగా, ఈరోజు 250 రూపాయలు పెరిగి 46,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,910 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,240 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo