Gold Update: పసిడి ప్రియులకు ఊరట..ఈరోజు స్థిరంగా గోల్డ్ మార్కెట్.!

Updated on 01-Jun-2023
HIGHLIGHTS

ఈరోజు స్థిరంగా గోల్డ్ మార్కెట్ సాగడంతో పసిడి ప్రియులకు ఊరట

గత మూడు రోజులుగా దూకుడు మీదున్న గోల్డ్ మార్కెట్

Gold పుంజుకోని మూడు నెలల గరిష్ఠాన్ని చూసింది

Gold Update: ఈరోజు స్థిరంగా గోల్డ్ మార్కెట్ సాగడంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది. గత మూడు రోజులుగా దూకుడు మీదున్న గోల్డ్ మార్కెట్ మూడు నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే, నవంబర్ 4న ఏ నెల కనిష్టాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ కేవలం 10 రోజుల్లోనే తిరిగి పుంజుకోని మూడు నెలల గరిష్ఠాన్ని చూసింది. మరి ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఉన్నదో తెలుసుకుందామా.

Gold Update

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,260 రూపాయలుగా ఉండగా, ఈరోజు మార్కెట్ స్థిరంగా నిలిచి, రూ.48,260 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.52,640 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,640 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,260 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,640 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,760 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,470 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :