GOLD: ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర.!

GOLD: ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర.!
HIGHLIGHTS

ధంతేరస్ రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది

దీపావళి తరువాత మార్కెట్ మెల్లగా క్రిందకు దిగజారడం మొదలుపెట్టింది

ధంతేరస్ రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. ఈ నెలలో 8 నెలల కనిష్ఠాన్ని చూసిన బంగారం మార్కెట్, ధంతేరస్ సందర్భంగా పెరిగిన కొనుగోళ్లతో ఒక్కరోజే తులానికి 750 రూపాయలు పెరుగుదలను చూసింది. అయితే, దీపావళి తరువాత మార్కెట్ మెల్లగా క్రిందకు దిగజారడం మొదలుపెట్టింది. ఈరోజు మార్కెట్లో గోల్డ్ స్వల్పంగా దిగినా, వాస్తవానికి స్థిరంగా ఉందనే చెప్పాలి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలావున్నదో చూద్దామా.                  

Gold:

ధంతేరస్ రోజున ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,010 రూపాయలుగా ఉండగా, ఈరోజు కొంచెం తగ్గిన గోల్డ్ మార్కెట్ 46,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,860 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,130 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,110 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,720 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo