Gold Market: ఈరోజు శాంతించిన గోల్డ్ మార్కెట్.. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 10-Nov-2022
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ నిశ్చలంగా వుంది

నిన్న మార్కెట్లో ఒక్కసారిగా పెరిగి గోల్డ్ ధర ఈరోజు నిలకడగా కొనసాగుతోంది

ఈ నెల గోల్డ్ రేట్ భారీగానే ఒడిదిడుకులను ఎదుర్కొంటోంది

Gold Market: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ నిశ్చలంగా వుంది. నిన్న మార్కెట్లో ఒక్కసారిగా పెరిగి గోల్డ్ ధర ఈరోజు నిలకడగా కొనసాగుతోంది. అయితే, ఈ నెల గోల్డ్ రేట్ భారీగానే ఒడిదిడుకులను ఎదుర్కొంటోంది. నిన్న మార్కెట్ లో బంగారం తులానికి 620 రూపాయల పెరుగుదలను చూసింది. ఈరోజు మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా వుంది. ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం.

Gold Market:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,360 రూపాయలుగా ఉండగా, ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా రూ.47,360 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.51,670 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,670 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,360 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,670 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,460 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,770 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,580 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :