Gold Rate Update: మరోసారి చుక్కల్లో బంగారం ధర.. కూడా ధర ఎంతంటే.!
Gold Update: మరోసారి బంగారం ధర చుక్కల్ని అంటుకుంది
61 వేల రూపాయల వద్ద కొనసాగిన బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగింది
ప్రసుతం బంగారం ధర మాత్రం చుక్కలోనే కొనసాగుతోంది
Gold Rate Update: మరోసారి బంగారం ధర చుక్కల్ని అంటుకుంది. దీపావళి పండుగ ముందు క్రిందకు దిగిన బంగారం ధర మెల్లగా పెరిగింది. 10 రోజుల క్రితం వరకూ కూడా 61 వేల రూపాయల వద్ద కొనసాగిన బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగింది. ప్రసుతం మార్కెట్ లో బంగారం ధర 62 వేల రూపాయల పైనే కొనసాగుతోంది. నిన్న కూడా మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయితే ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగింది. కానీ ప్రసుతం బంగారం ధర మాత్రం చుక్కలోనే కొనసాగుతోంది.
Todays Gold Rate Update:
ఈరోజు గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,560 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,350 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Jio Phone Prima ఫోన్ కోసం కొత్త ప్లాన్స్ అందించిన జియో.!
గత 10 రోజుల బంగారం రేట్ అప్డేట్
ఇక గత 10 రోజుల బంగారం రేట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, నవంబర్ 19 న 10 గ్రాముల 24 Carat స్వచ్ఛమైన బంగారం దర రూ. 61,690 రూపాయల వద్ద ఉండగా 10 గ్రాముల 22 Carat ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,550 రూపాయల వద్ద వుంది. అయితే, మెల్లగా పెరిగిం బంగారం ధర నవంబర్ 21న తులానికి 380 రూపాయలు, 25న తులానికి 320, 27న తులానికి 270 రూపాయల పెరుగు ధలను నమోదు చేసింది.
ఇలా మెల్లగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ. 62,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంతేకాదు, గోల్డ్ రేట్ మరింత పెరిగి అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్ అంచనాలు మాత్రం గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగవచ్చనే చెబుతున్నాయి. మరి అసలు గోల్డ్ మార్కెట్ స్థిరంగా ఉంటుందో పైకి చూస్తుందో అని.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి