GOLD: నిన్నటి నుండి మారిన గోల్డ్ రేట్ ట్రెండ్..!!

Updated on 26-Aug-2022
HIGHLIGHTS

గత మూడు రోజుల నుండి గోల్డ్ రేట్ ట్రెండ్ మారింది

గత వారం మొత్తం డౌన్ ట్రేడ్ చేసిన బంగారం ధర

గత మూడు రోజుల నుండి పైపైకి వెళుతోంది

గత మూడు రోజుల నుండి గోల్డ్ రేట్ ట్రెండ్ మారింది. గత వారం మొత్తం డౌన్ ట్రేడ్ చేసిన బంగారం ధర, గత మూడు రోజుల నుండి పైపైకి వెళుతోంది. ఇదే బాటలో ఈరోజు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇక మూడు రోజుల ట్రెండ్ ను చూస్తే, ఈ మూడు రోజుల్లో బంగారం ధర దాదాపుగా 800 వరకూ పెరిగింది. మరి  ఈరోజు తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలు మరియు దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకుందామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,270 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,640 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,970 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,970 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,970 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,970 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,390 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,790 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :