Gold Rate: ఎంత పెరిగిందో ఈరోజు అంత తగ్గిన గోల్డ్ రేట్.!
ఈ వారంలో గోల్డ్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది
Gold Rate ఈ రోజు మళ్లీ తిరిగి నష్టాలను చూసి యధా రేటుకు చేరుకుంది
గోల్డ్ మార్కెట్ నెల చివరికి చేరుకునే వారికి మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది
Gold Rate: ఈ వారంలో గోల్డ్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ వారం ప్రారంభం నుండి వరుసగా రెండు రోజులు నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్, నిన్న పెరుగుదలను నమోదు చేసింది. అయితే, ఈ రోజు మళ్లీ తిరిగి నష్టాలను చూసి యధా రేటుకు చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుండి లాభాల బాటలోనే సాగిన గోల్డ్ మార్కెట్ నెల చివరికి చేరుకునే వారికి మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది.
Gold Rate Update
గత వారం రికార్డు రేటును తాకిన గోల్డ్ మార్కెట్, తర్వాత క్రిందకు దిగడం మొదలు పెట్టింది. ఈ వారంలో గడిచిన రెండు రోజుల్లో రెండు వేల క్రిందకు దిగి కనిష్ట రేటును చేరుకుంది. అయితే, నిన్న గోల్డ్ రేట్ మళ్ళీ తిరిగి పైకి లేచి 73 వేల వైపుగా సాగింది. కానీ, ఈరోజు గోల్డ్ మార్కెట్ నష్టాలను చూడటంతో, గోల్డ్ రేట్ మళ్ళీ తిరిగి 72 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది.
ఈరోజు గోల్డ్ మార్కెట్ ప్రధాన మార్కెట్ లో తులానికి రూ. 380 రూపాయలు నష్టాన్ని చూసి రూ. 72,270 రూపాయల మార్క్ ను అంటి పెట్టుకొని కొనసాగింది. నిన్నటితో పోలిస్తే గోల్డ్ రేట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగజారింది.
Also Read: Meta AI Ray-Ban Glass: స్టైల్ మరియు స్మార్ట్ కలయికతో కొత్త కళ్ళజోడు తెచ్చిన మెటా.!
ఈ వారం గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటి?
ఈ వారంలో గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర కనిష్ట రేటు లోనే కొనసాగుతోంది. ఎందుకంటే, గోల్డ్ మార్కెట్ గడిచిన 3 రోజుల్లో రూ. 74,340 రూపాయల గరిష్ట రేటు నుంచి రూ. 72,160 రూపాయల కనిష్ఠ రేటును చూసింది.
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ఉదయం రూ. 72,650 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 380 రూపాయలు క్రిందకు దిగి రూ. 72,270 రూపాయల వద్ద క్లోజింగ్ ను రిపోర్ట్ చేసింది.
ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక ఈ రోజు కొనసాగిన 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, రూ. 66,600 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 350 రూపాయల నష్టాన్ని చూసి రూ. 66,250 రూపాయల వద్దకు చేరుకుంది.