Gold Rate: ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అంతేకాదు, గత వారం రోజుల నాడు చేరుకున్న కనిష్ట ధరను తాకి స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా గోల్డ్ మార్కెట్ ఒకే రేటు వద్ద నిలబడి వుంది. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న రేటుతో పోలిస్తే మాత్రం ప్రస్తుత బంగారం ధర తులానికి 2,000 రూపాయలకు పైగా పెరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూద్దామా.
ఈరోజు రూ.52,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా నిలబడి రూ.52,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.56,730 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,880 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.