Gold Rate Update: పెరుగుతున్న గోల్డ్ మార్కెట్..ఈరోజు రేటు ఎంతంటే.!
మార్కెట్ లో బంగారం ధర మళ్ళీ మెల్లగా పుంజుకుంటోంది
గత నెల మొత్తం స్థిరంగా నిలబడిన గోల్డ్ మార్కెట్
ఈరోజు కూడా బంగారం ధర మెల్లగా పెరిగింది
Gold Rate Update: మార్కెట్ లో బంగారం ధర మళ్ళీ మెల్లగా పుంజుకుంటోంది. గత నెల మొత్తం స్థిరంగా నిలబడిన గోల్డ్ మార్కెట్ ఈ నెలలో మెల్ల మెల్లగా పెరుగుతోంది. ఈరోజు కూడా బంగారం ధర మెల్లగా పెరిగింది మరియు గత 10 రోజుల గరిష్టాన్ని నమోదు చేసింది. నిన్న మొన్నటి వరకూ చాలా నిలకడగా సాగిన గోల్డ్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
Gold Rate Update
బంగారం మార్కెట్ ఈరోజు స్వల్పంగా పెరిగింది. గత వారం మొత్తం కూడా చాలా స్థిరంగా కొనసాగిన బంగారం ధర, ఈ వారంలో పెరుగుదలను చూసింది. ఈ వారం మొత్తం మీద బంగారం ధర తులానికి రూ. 660 రూపాయల పెరుగుదలను చూసింది. ఈ వారం ప్రారంభంలో సోమవారం నాడు రూ. 62,950 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర రూ. 660 రూపాయలు పెరిగి రూ. 63,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read: Jio Big Offer: మూడు నెలల పాటు 14 OTT లు మరియు 18 Extra డేటా అందించే బెస్ట్ ప్లాన్.!
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ఉదయం రూ. 63,440 రూపాయల రేటు వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 160 రూపాయల పెరుగుదలను చూసి, రూ. 63,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక ఈరోజు కొనసాగిన 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 58,150 రూపాయల వద్ద మొదలైన 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 58,300 రూపాయల వద్ద క్లోజింగ్ సెట్ చేసింది.