మే 1 గోల్డ్ రేట్: గోల్డ్ రేట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!

మే 1 గోల్డ్ రేట్: గోల్డ్ రేట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఏప్రిల్ నెల మొత్తం గోల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ తో సాగింది

ఓవరాల్ గా మాత్రం లాభాలనే నమోదు చేసింది

గోల్డ్ రేట్ ఈ నెల ఎలా కొనసాగుతుందో చూడాలి

ఏప్రిల్ నిన్నటితో ముగిసింది మరియు మే నెల మొదటి రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో తెలుసుకుందాం.  మే నెల ప్రారంభం అవుతూనే గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది. అంటే, ఈరోజు గోల్డ్ రేట్ మార్కెట్ లో స్వల్పంగా తగ్గింది మరియు 61 వేల దిగువున కొనసాగుతోంది. గత నెల ఓవరాల్ గా 1,000 రూపాయల వరకూ పెరిగిన గోల్డ్ రేట్ ఈ నెల ఎలా కొనసాగుతుందో చూడాలి. 

ఈరోజు గోల్డ్ రేట్

ఇక ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 55,700 వద్ద 22 క్యారెట్ 10 గ్రాముల ఉండగా, రూ. 60,760 రూపాయల వద్ద 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ కొనసాగుతోంది. 

ఏప్రిల్ నెల గోల్డ్ మార్కెట్ ఎలా వుంది?

ఏప్రిల్ నెల మొత్తం గోల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ తో సాగింది. అయితే, ఓవరాల్ గా మాత్రం లాభాలనే నమోదు చేసింది. అంతేకాదు, ముందు నుండి గోల్డ్ రేట్ పెరగవచ్చనే నిపుణుల అంచనాలను నిజం చేసింది. నెలలో ఒక దశలో రూ. 61,800 రూపాయల వద్దకు చేరుకున్న గోల్డ్ రేట్ మరింత భారీ ఆల్ టైమ్ అధిక రేట్ తో కొత్త రికార్డు నమోదు చేస్తూందమో అనిపించినా, మళ్ళి మెల్లగా క్రిందకు దిగి స్టేబుల్ అయ్యింది. 

ఏప్రిల్ నెల ప్రారంభంలో రూ.55,000 రేటు వద్ద సాగిన 10 గ్రాముల 22K గోల్డ్ సూచీల ప్రయాణం నెల చివరికి రూ. 55,850 వద్ద ముగిసింది. 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 60,000 వద్ద మొదలై రూ. 60,930 వద్ద ముగిసింది. ఏప్రిల్ నెలలో 3వ తేది రూ. 59,670 ధరతో  తక్కువ రేటును గోల్డ్ మార్కెట్ చూడగా, ఏప్రిల్ 14న రూ. 61,800 రేటుతో హైఎస్ట్ రేట్ ను తాకింది. 

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు ఒక తులం 22K గోల్డ్ రేట్ రూ. 55,700 గా ఉండగా, ఓక్ తులం 24K గోల్డ్ రేట్ రూ. 60,760 గా ఉన్నది.

గమనిక: లోకల్ మార్కెట్ మరియు ఆన్లైన్ మార్కెట్ గోల్డ్ రేట్ లో మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo