Gold Rate Update: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.!
ఈరోజు గోల్డ్ మార్కెట్ దాదాపుగా స్థిరంగా కొనసాగింది
2024 లో గోల్డ్ మార్కెట్ దూసుకు పోతుందని అంచనా వేసిన వారికి నిరాశే
గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం కొంత గడ్డు కాలంగా మారింది
Gold Rate Update: ఈరోజు గోల్డ్ మార్కెట్ దాదాపుగా స్థిరంగా కొనసాగింది మరియు 62 వేల మార్క్ వద్దనే నిలిచింది. 2024 లో గోల్డ్ మార్కెట్ దూసుకు పోతుందని అంచనా వేసిన వారికి నిరాశే ఎదురయ్యింది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం కొంత గడ్డు కాలంగా మారింది. అయితే, బంగారం కొనాలని చూస్తున్న పసిడి ప్రియులకు మాత్రం ప్రియంగా మారింది. అయితే, వాస్తవానికి 2023 ప్రారంభంలో కొనసాగిన గోల్డ్ రేట్ తో పోలిస్తే మాత్రం బంగారం ధర ఇప్పటికి అధికంగా ఉన్నట్లే చెప్పాలి.
Gold Rate Update
ఈరోజు ఉదయం రూ. 62,830 రూపాయల వద్ద ప్రారంభమైన ఒక తులం స్వచ్ఛమైన బంగారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 120 రూపాయల పైకి చేరుకొని రూ. 62,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, ఈరోజు మార్కెట్ స్వల్పంగా పెరియింది మరియు జనవరి 9 వ తేది నమోదు చేసిన రేటును సమం చేసింది.
Also Read : Sankranti 2024: మీకు నచ్చిన వారికి పండుగ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న 24 క్యారెట్ బంగారం ధర అప్డేట్ ను చూస్తే, ఈరోజు రూ. 62,830 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 62,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది. ఈ వారం మొత్తంగా మీద గోల్డ్ రేట్ దాదాపుగా స్థిరంగానే కొనసాగుందని చెప్పవచ్చు. అయితే, నెల ప్రారంభంతో పోలిస్తే మాత్రం రూ. 1,000 రూపాయలకు పైగా క్రిందకు దిగిందని చెప్పొచ్చు.
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ. 57,600 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 57,700 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. ఈ నెల మొదట్లో కొనసాగిన రేటుతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ కూడా దాదాపుగా రూ. 900 రూపాయలకు పైగా క్రిందకు దిగింది.
గమనిక: Online గోల్డ్ రేట్ మరియు మార్కెట్ గోల్డ్ రేట్ లకు వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.