జూన్ 1 గోల్డ్ రేట్: ఈరోజు గోల్డ్ రేట్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

జూన్ 1 గోల్డ్ రేట్: ఈరోజు గోల్డ్ రేట్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

నిన్న గోల్ మార్కెట్ 61 వేల వద్ద మే నెల క్లోజింగ్ ని సెట్ చేసింది

గోల్డ్ రేట్ నాటకీయ పరిణామాలను చూసింది

జూన్ 1 గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి

నిన్న గోల్ మార్కెట్ 61 వేల వద్ద మే నెల క్లోజింగ్ ని సెట్ చేసింది. అయితే, మే నెల మొత్తం మీద గోల్డ్ రేట్ నాటకీయ పరిణామాలను చూసింది. అయితే, నెల చివరికి మాత్రం దాదాపుగా నెల స్టార్టింగ్ లో ఉన్న గోల్డ్ రేట్ తోనే ముగించడం గమనార్హం. అయితే, ఈరోజు జూన్ నెల ప్రారంభం అవుతూనే గోల్డ్ రేట్ మళ్ళీ నిలకడగా కొనసాగుతోంది. జూన్ 1 గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి. 

జూన్ 1 గోల్డ్ రేట్

ఈరోజు ప్రధాన మార్కెట్ లో గోల్డ్ రేట్ స్థిరంగా వుంది. నిన్న తులానికి 440 రూపాయల వరకు పెరిగిన ఒక తులం గోల్డ్ రేట్ ఈరోజు 150 రూపాయలు పడిపోయింది. అంటే, గోల్డ్ మార్కెట్ ఈరోజు దాదాపుగా నిలకడగా ఉన్నట్లే. ఇక ఈరోజు గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ప్రధాన మార్కెట్ లో 24K (10గ్రా) గోల్డ్ రేట్ రూ. 60,760 రూపాయల వద్ద ముగియగా, 22K (10గ్రా) గోల్డ్ రేట్ రూ. 55,700 రూపాయల వద్ద ముగిసింది. 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో పైన సూచించిన గోల్డ్ రేట్ లే కొనసాగుతున్నాయి. అంటే, ఈ నగరాలలో 24K (10గ్రా) పసిడి రూ. 60,760 గాను మరియు 22K (10గ్రా) పసిడి ధర రూ. 55,700  గాను ఉన్నాయి. 

ఇక మే నెల ఓపెనింగ్ గోల్డ్ రేట్ తో జూన్ నెల గోల్డ్ రేట్ ఓపెనింగ్ ను పోల్చిచూస్తే, మే 1వ తేదీ రూ. 60,700 రేటు వద్ద గోల్డ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది మరియు నెల చివరికి రూ. 60,930 వద్ద క్లోజింగ్ రేట్ ను నమోదు చేసింది. ఇక జూన్ 1 న, అంటే ఈరోజు గోల్డ్ మార్కెట్ రూ. 60,760 రూపాయల రేటుతో ఆరంభించింది. అంటే, గత నెల ఓపెనింగ్ మరియు ఈ నెల ఓపెనింగ్ దాదాపుగా ఒక్కటే. 

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్స్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo