Gold Rate: 60 వేల వద్ద ఊగిసలాడుతున్న గోల్డ్ మార్కెట్.!

Updated on 11-Aug-2023
HIGHLIGHTS

దేశంలో గోల్ మార్కెట్ ఒకరోజు అలా ఒకరోజు ఇలా సాగిపోతోంది

భారీ లాభాలను చూసిన గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 60 వేల వద్ద ఊగిసలాడుతోంది

డాలర్ తో రూపాయి ప్రస్తుతం మారకం విలువలు గోల్డ్ రేట్ పైన ప్రభావం చూపుతోంది

దేశంలో గోల్ మార్కెట్ ఒకరోజు అలా ఒకరోజు ఇలా సాగిపోతోంది. గతంలో, భారీ లాభాలను చూసిన గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 60 వేల వద్ద ఊగిసలాడుతోంది. అయితే, గత మూడు నెలల మార్కెట్ ను పరిశీలిస్తే మాత్రం గోల్డ్ ధర ప్రస్తుతానికి యావరేజ్ గా కొనసాగుతోంది. కానీ, పెరుగుతున్న నిత్యావసర ధరలు, అంతర్జాతీయ మార్కెట్ రేట్లు మరియు డాలర్ తో రూపాయి ప్రస్తుతం మారకం విలువలు గోల్డ్ రేట్ పైన ప్రభావం చూపుతోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర అప్డేట్ మరియు ధర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Gold Rate:

ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 60,060 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 22K ఆర్నమెంట్ బంగారం ధర రూ. 55,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంలో ఆగష్టు 1న రూ. 60,440 వద్ద మొదలైన బంగారం ధర ఇప్పటి వరకూ డౌన్ ట్రేడ్ ని ఫాలో అయ్యింది. ఈ నెలలో ఆగష్టు 3వ తేదిన గోల్డ్ రేట్ 60 వేల దిగువన కొనసాగింది.

ఇక గత మూడు నెలల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, జూలై  నెలలో గోల్డ్ మార్కెట్ అతి తక్కువ రేటును నమోదు చేసింది. అయితే, మళ్ళీ పెరిగిన బంగారం ధర మార్కెట్ అంచనాలను తల్లకిందులు చేసింది. కానీ, ఎట్టకేలకు గోల్డ్ మార్కెట్ ఇప్పుడు 60 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్:

ఇక తెలుగు రాష్ట్రాల మార్కెట్ లలో గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్ లలో ఈరోజు గోల్డ్ రేట్ రూ . 60,060 (24K) మరియు రూ. 55,050 (22K) వద్ద కొనసాగుతోంది. 

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు ఆఫ్ లైన్ గోల్డ్ రేట్ ధరలలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :