Gold Rate Update: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే, స్వల్పంగా తగ్గినా దాదాపుగా స్థిరంగానే కొనసాగుతోందని చెప్పాలి. ఎందుకంటే, ఈరోజు మార్కెట్ లో బంగారం ధర అదే 62 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే, లైవ్ అప్డేట్ ను పరిశీలిస్తే మాత్రమే నిన్నటి ధరతో పోలిస్తే తులానికి రూ. 220 రూపాయలు పెరిగినట్లు చూడవచ్చు. అంతేకాదు, ఈ వారం మొత్తంగా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు మాత్రం స్వల్పంగా లాభాలను చూసింది.
ఇక ఈరోజు మరియు ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్ లోకి వెళితే, ఈరోజు గోల్డ్ రేట్ తులానికి రూ. 220 రూపాయలు పెరిగి రూ. 62,290 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. ఇక ఈ వారం గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఈ వారం మొత్తం మీద తులానికి రూ. 870 రూపాయలు క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ రూ. 220 రూపాయలు పెరిగింది. ఓవరాల్ గా బంగారం ధర ఈ వారంలో రూ. 650 రూపాయల పతనాన్ని చూసింది.
Also Read: Infinix HOT 40i: 10 వేల ధరలో 16GB RAM మరియు 256GB స్టోరేజ్ తో లాంఛ్.!
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,079 వద్ద మొదలై రూ. 220 రూపాయలు పెరిగి రూ. 62,290 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 56,900 రూపాయల వద్ద మొదలై రూ. 200 పైకి ఎగబాకి రూ. 57,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.