Gold Price: మార్కెట్ లో ఈరోజు స్వల్పంగా దిగజారిన బంగారం ధర.!

Updated on 03-Nov-2022
HIGHLIGHTS

మార్కెట్ లో ఈరోజు స్వల్పంగా దిగజారిన బంగారం ధర

బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగజారింది

చిన్న మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేసే కస్టమర్ల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించదు

Gold Price: మార్కెట్ లో ఈరోజు స్వల్పంగా దిగజారిన బంగారం ధర. US Fed తీసుకున్న ధర పెరుగుదల కారణంగా బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగజారింది. అయితే, చిన్న మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేసే కస్టమర్ల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. కానీ, టోటల్ గా గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగడం మదుపర్లతో పాటుగా కొనుగోలుధారాలుకు కూడా ఆశాజనకంగానే ఉంటుంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎక్కడ ఎలా ఉన్నదో చూద్దాం పదండి.

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,850 రూపాయలుగా ఉండగా, ఈరోజు 150 రూపాయల తరుగుదలను చూసి, గోల్డ్ ధర 46,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,320 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,320 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,710 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,320 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,100 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :