Gold Rate: ఆకాశాన్నంటిన బంగారం ధర ఎన్నడూ లేని విధంగా గోల్డ్ మార్కెట్.!

Gold Rate: ఆకాశాన్నంటిన బంగారం ధర ఎన్నడూ లేని విధంగా గోల్డ్ మార్కెట్.!
HIGHLIGHTS

ఎన్నడూ లేని విధంగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది

నిపుణులు ముందుగా అంచనా వేసిన విధంగానే గోల్డ్ రేట్ భారీగా పెరిగిపోయింది

గత నెల భారీగా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్

Gold Rate: ఎన్నడూ లేని విధంగా బంగారం ధర ఆకాశాన్ని తాకింది. ఈ సంవత్సరం ప్రారంభంలో నిపుణులు ముందుగా అంచనా వేసిన విధంగానే గోల్డ్ రేట్ భారీగా పెరిగిపోయింది. గత నెల భారీగా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈ నెలలో మాత్రం ఊహించని విధంగా భారీ పెరుగుదలను నమోదు చేసింది. మరి ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధర మరియు మార్కెట్ అప్డేట్ ఎలా ఉందో చూద్దామా.

Gold Rate:

ఈనెల ప్రారంభంలో మార్చి 1వ తేదీన బంగారం ధర 63 వేల రూపాయల వద్ద ప్రారంభమైంది. అయితే, కేవలం 10 రోజుల్లోనే భారీగా ఊపందుకున్న గోల్డ్ మార్కెట్ దెబ్బకి గోల్డ్ రేట్ లో భారీవ్యత్యాసాన్ని నమోదు చేసింది. కానీ, ఈ వారంలో మొదటి రోజైన ఈరోజు మాత్రం గోల్డ్ మార్కెట్ స్థిరంగా నిలిచింది.

ఇక మొత్తంగా ఈ పది రోజుల్లో పెరిగిన బంగారం ధరను చూస్తే, గోల్డ్ మార్కెట్ పది రోజుల్లోనే రూ. 3,000 రూపాయలకు పైగా పెరుగుదలను చూసింది. ఇక మార్కెట్ ఇదే విధంగా కొనసాగితే బంగారం ధర 70 వేలకు చేరుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం ఉండదేమో అనిపిస్తోంది.

అయితే, ఎప్పటి మాదిరిగానే గోల్డ్ మార్కెట్ ని అంచనా వేయడం అంత సులభం కాదు కాబట్టి, ఏం జరుగుతుందో వేచి చూడాలి. కానీ ఇప్పటికే గోల్డ్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మాత్రం అద్భుతమైన లాభాలను గోల్డ్ మార్కెట్ తెచ్చిపెట్టింది.

Also Read: భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న Samsung పవర్ ఫుల్ Soundbar

Today’s Gold Rate:

ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగింది. ఈరోజు ఉదయం Rs.66,270 వద్ద ప్రారంభమైన 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా నిలిచి అదే రేటు వద్ద క్లోజింగ్ ని నమోదు చేసింది.

అలాగే, ఈరోజు ఉదయం Rs. 60,750 వద్ద ప్రారంభమైన 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా అదే రేటు వద్ద స్థిరంగా నిలబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo