Gold: మారుతున్న గోల్డ్ మార్కెట్ అంచనాలు.. కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 01-Jun-2023
HIGHLIGHTS

Gold: మారుతున్న గోల్డ్ మార్కెట్ అంచనాలు

నిన్న మార్కెట్ లో నిశ్చలంగా ఉన్న గోల్డ్ రేట్

ఈరోజు పసిడి మరొకసారి పెరిగింది

Gold: మారుతున్న గోల్డ్ మార్కెట్ అంచనాలు. నిన్న మార్కెట్ లో నిశ్చలంగా ఉన్న గోల్డ్ రేట్, ఈరోజు మరొకసారి పెరిగింది. గత రెండు రోజుల్లోనే మార్కెట్ లో బంగారం తులానికి 1,100 రూపాయల వరకు పెరిగి పోయింది. మొత్తంగా చూస్తే, ఈ నెల పసిడి ప్రియులకు మింగుడు పడని విధంగానే కొనసాగుతోంది. అయితే, గోల్డ్ పైన ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ లకు మాత్రం మార్కెట్ ఫలితాలు బాగున్నాయి. మరి ఈరోజు హైదరాబార్, విజయవాడ మరియు దేశరాజధాని ఢిల్లీ  మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాం.

Gold:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంa ధర 47,360 రూపాయలుగా ఉండగా, ఈరోజు 440 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, రూ.47,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.52,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.53,180 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :