Gold Rate: దేశంలో బంగారం ధరలు ఎవరూ ఊహించనంతగా పడిపోతున్నాయి. గత వారం మొత్తం భారీ నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా అదే బాట పట్టింది. సెప్టెంబర్ 23వ తేదీ నుండి మొదలైన గోల్డ్ రేట్ పతనం ఇంకా గాడిలో పడలేదు. ఈరోజు గోల్డ్ రేట్ ట్రెండ్ లో మార్పు రావచ్చని ఎదురు చూసిన మదుపరులకు ఈరోజు కూడా చుక్కెదురయ్యింది. అయితే, అధిక రేటు కారణంగా గోల్డ్ కొనాలని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు మాత్రం సరైన సమయంగా గోచరిస్తోంది.
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు రూ. 58,200 రూపాయల వద్ద ప్రారంభమైన 24 క్యారెట్ (10 గ్రా||) బంగారం ధర రూ. 160 రూపాయలు క్రిందకు దిగి రూ. 58,040 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ. 53,350 రూపాయల వద్ద మొదలైన 22 క్యారెట్ (10గ్రా||) బంగారం ధర రూ. 53,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read : Motorola Festive Offers: భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న మోటోరోలా స్మార్ట్ ఫోన్స్.!
ఇక గత 10 రోజుల గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా వుంది? అని పరిశీలిస్తే, గత 10 రోజుల్లో బంగారం ధర భారీగా పతనమయ్యింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గోల్డ్ రేట్ గత 10 రోజుల్లో పడిపోయింది. సెప్టెంబర్ 3న మాక్రెట్ లో బంగారం రూ. 59,950 రూపాయలుగా ఉండగా, తరువాత నుండి భారీ పతనం దేశంగా గోల్డ్ రేట్ పరుగులు తీసింది.
సెప్టెంబర్ 26న నుండి మొదలైన ఈ గోల్డ్ రేట్ ట్రెండ్ సెప్టెంబర్ 28 న రూ. 650 భారీ పతనాన్ని చూసిన తరువాత మరింతగా పడిపోయింది. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పడిపోవడంతో మొత్తంగా గడిచిన 10 రోజుల్లో మొత్తంగా తులానికి రూ. 1,910 రూపాయల భారీ పతనాన్ని చూసింది.
Also Read: Amazon Cricket Fever Offer సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్.!
ఇక అక్టోబర్ నెల గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే, మార్చి 2023 తరువాత గోల్డ్ రేట్ ఇంత తక్కువ రేటును నమోదు చేయండం ఇదే మొదటిసారి. అంతేకాదు, పండుగ సీజన్ ముందున్నా గోల్డ్ మార్కెట్ పడిపోవడం కొంత ఆశ్చర్య పరుస్తోంది.
Note : Online గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్ రేట్ లలో మార్పులు ఉంటాయి.