బంగారం ధర ఈరోజు 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.!

బంగారం ధర ఈరోజు 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.!
HIGHLIGHTS

ఈరోజు బంగారం 18 నెలల కనిష్ఠానికి చేరుకొని ఆశ్చర్యపరిచింది

ఈ నెల ప్రారంభం నుండి పడిపోతూ వచ్చిన బంగారం ధర

ఈరోజు మార్కెట్లో బంగారం ధర 50 వేల రూపాయల దిగువకు చేరుకుంది

ఈరోజు బంగారం 18 నెలల కనిష్ఠానికి చేరుకొని ఆశ్చర్యపరిచింది. ఈ నెల ప్రారంభం నుండి పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యింది. ఈరోజు మార్కెట్లో బంగారం ధర 50 వేల రూపాయల దిగువకు చేరుకుంది. ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర తులానికి 400 కు పైగా తగ్గుదను నమోదు చేసింది. ఇక ఈరోజు మార్కెట్ లో బంగారం ధరను పరిశీలిస్తే, బంగారం ధర ఈరోజు 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. గోల్డ్ మార్కెట్ ఈరోజు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నదో పరిశీలిద్దామా.  

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,200 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయలు క్రిందకు దిగి  45,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.49,960 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,810 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo