Gold Rate: ఈరోజు కూడా పెరిగిన బంగారం..ఈరోజు New update తెలుసుకోండి.!
ఈరోజు కూడా Gold Rate పెరుగుదలను నమోదు చేసింది
బంగారం ధర ఎక్కడి వరుకూ చేరుకుంటుందో అని పసిడి ప్రియులు విస్తుపోతున్నారు
ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు గోల్డ్ మార్కెట్ వివరాలు
Gold Rate: ఈరోజు కూడా బంగారం ధర పెరుగుదలను నమోదు చేసింది. గత వారం మొత్తం పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ వారంలో కూడా అదే దారిలో కొనసాగింది. ఈ వారం మొత్తం మీద ఇప్పటికే బంగారం ధర తులానికి 500 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు, రానున్న రోజుల్లో మరింతగా పెరగవచ్చని చెబుతున్న నిపుణుల మాటలు వింటుంటే బంగారం ధర ఎక్కడి వరుకూ చేరుకుంటుందో అని పసిడి ప్రియులు విస్తుపోతున్నారు. మరి ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు గోల్డ్ మార్కెట్ వివరాలు తెలుసుకుందామా.
Gold Rate Today:
ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా లాభాలను చూసింది మరియు ఈరోజు రూ. 61,800 రూపాయల వద్ద ప్రారంభమైన ఒక తులం బంగారం ధర రూ. 61,960 రూపాయల వద్దకు చేరుకుంది.
24 Carat బంగారం రేటు
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat బంగారం రేటు విషయానికి వస్తే, ఈరోజు రూ. 61,800 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 160 పెరిగి రూ. 61,960 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
22 Carat బంగారం రేటు
ఇక 22 Carat బంగారం రేటు ను పరిశీలిస్తే, ఈరోజు రూ. 56,650 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ. 150 రూపాయలు పెరిగి రూ. 56,800 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : Nokia 105 Classic: UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో New Phone లాంచ్.!
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్
ఈ వారం ప్రారంభంలో అక్టోబర్ 23న గోల్డ్ రేట్ రూ. 300 రూపాయలు క్రిందకు దిగిన గోల్ రేట్ రూ. 61,450 వద్ద నిలిచింది. అయితే, తరువాత ఆరోజు నుండి వరుసగా పెరిగిన బంగారం ధర ఈరోజు రూ. 61,960 రూపాయల వద్దకు చేరుకుంది. అక్టోబర్ 23వ తేదీ నుండి ఈరోజు వరకూ బంగారం ధర తులానికి రూ. 500 రూపాయలకు పైగా పెరిగింది.
ఇక గత వారం విషయానికి వస్తే, గత వారంలో బంగారం ధర రూ. 1,700 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. మొత్తానికి ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో 62 వేల మార్క్ ను దాటేసింది.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.